‘సీఏఏ’పై స్టే ఇవ్వండి: సుప్రీంలో ఒవైసీ పిటిషన్‌ | Owaisi Filed Petition On Caa In Supreme Court Seeks Stay | Sakshi
Sakshi News home page

సీఏఏ అమలు ఆపండి.. సుప్రీం కోర్టులో ఒవైసీ పిటిషన్‌

Published Sat, Mar 16 2024 1:52 PM | Last Updated on Sat, Mar 16 2024 2:10 PM

Owaisi Filed Petition On Caa In Supreme Court Seeks Stay - Sakshi

న్యూఢిల్లీ: ఇటీవలే అమలులోకి వచ్చిన సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌(సీఏఏ)పై స్టే ఇవ్వాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సుప్రీంకోర్టులో శనివారం పిటిషన్‌ వేశారు.  ఈ పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగా సీఏఏ కింద  కొత్తగా ఎవరికీ  పౌరసత్వం ఇవ్వవద్దని పిటిషన్‌లో ఒవైసీ కోరారు.

కాగా, 2019లో కేంద్రం తీసుకువచ్చిన సీఏఏ చట్టానికి సంబంధించి తాజాగా కేంద్రం రూల్స్‌ నోటిఫై చేసి అమలులోకి తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి డిసెంబర్‌ 31,2014కు ముందు దేశంలోకి వలస వచ్చిన నాన్‌ ముస్లింలకు భారత పౌరసత్వం ఇస్తారు. సీఏఏ పోర్టల్‌లో దరఖాస్తు చేసిన కొందరు మైగ్రెంట్స్‌కు ఇప్పటికే భారత పౌరసత్వం కల్పించారు.

ఇదీ చదవండి.. చైనా, పాక్‌ స్నేహం భారత్‌కు సవాలే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement