వివాహేతర సంబంధం.. దేహశుద్ధి చేసిన భార్య | In Kukatpally Wife Beats Husband With Slippers Over Illicit Relationship | Sakshi
Sakshi News home page

కూకట్‌పల్లిలో వెలుగు చూసిన వైనం

Published Thu, Jul 25 2019 10:27 AM | Last Updated on Thu, Jul 25 2019 12:02 PM

In Kukatpally Wife Beats Husband With Slippers Over Illicit Relationship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మరో మహిళతో ప్రేమాయణం సాగిస్తూ.. బిడ్డను, తనను నిర్లక్ష్యం చేసిన భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చెప్పులతో కొట్టిందో భార్య. వివరాలు.. మంచిర్యాల జిల్లా కొత్తకమ్ముగూడెం గ్రామానికి చెందిన లక్ష్మణ్‌కు.. సౌజన్య అనే మహిళతో 2010లో వివాహం అయ్యింది. వీరికి ఓ కుమారుడు. ఈ క్రమంలో కొద్ది కాలం క్రితం లక్ష్మణ్‌కు కరీంనగర్‌ జిల్లా వెంకట్రావు పేటకు చెందిన అనూష అనే మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. కాగా అనూషకు కూడా 2013లో కోలా రవికాంత్‌ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారికి ఓ బాబు కూడా ఉన్నాడు.

ప్రస్తుతం అనూష, భర్త రవికాంత్‌ను వదిలిపెట్టి.. లక్ష్మణ్‌తో కలిసి కూకట్‌పల్లిలోని ప్రగతి నగర్‌లో నివాసం ఉంటుంది. ఈ క్రమంలో లక్ష్మణ్‌, అనూషల సంబంధం గురించి సౌజన్యకు తెలిసి నిలదీసింది. లక్ష్మణ్‌, అనూష కలిసి దిగిన ఫోటోలను పెద్దమనుషుల ముందు పెట్టి నిలదీయగా.. అవి గతంలో దిగిన ఫోటోలని.. ప్రసుత్తం తమ ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదన్నాడు లక్ష్మణ్‌. కొద్ది రోజుల పాటు బుద్ధిగానే ఉన్న లక్ష్మణ్‌.. తిరిగి అనూషతో తన సంబంధాన్ని కొనసాగించడం ప్రాంరభించాడు. ఈ క్రమంలో సౌజన్య గురువారం లక్ష్మణ్‌, అనూషలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని.. చెప్పుతీసుకుని చితకబాదింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement