illicit relation
-
భర్తతో రిలేషన్.. ప్రశ్నించిన భార్యపై యువతి యాసిడ్ దాడి
నాగ్‌పూర్: ప్రేమించిన అమ్మాయి తనకు దక్కదేమోనన్న కోపంతో యాసిడ్ దాడి చేసిన సంఘటనలు చూసే ఉంటాం. కానీ, ఓ 25 ఏళ్ల యువతి తన ప్రియుడి భార్యపై యాసిడ్ దాడి చేసింది. ఈ క్రూరమైన చర్య మహారాష్ట్రలోని నాగపూర్‌లో గత శనివారం ఉదయం జరిగింది. ఈ యాసిడ్ దాడిలో తల్లి, రెండునరేళ్ల కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. బుర్ఖా ధరించిన ఇద్దరు మహిళలు స్కూటీపై బాధితుల వద్దకు వచ్చారు. ఒక్కసారిగా వారిపై యాసిడ్ దాడి చేశారు. మహిళతో పాటు తన ఒడిలో బాలుడిపైనా యాసిడ్ పడి తీవ్ర గాయాలయ్యాయి. దాడి చేసి క్షణాల్లోనే అక్కడి నుంచి పరారయ్యాను నిందితులు. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ‘వివాహేతర సంబంధంపై బాధితురాలు, నిందితురాలి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తన స్నేహితురాలితో కలిసి బాధితురాలు, ఆమె కుమారుడిపై యాసిడ్ దాడి చేసింది. బాధితులను ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించి చికిత్స అందిస్తున్నాం. ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి.’ అని యశోద నగర్ పోలీస్‌లు తెలిపారు. మొబైల్ ఫోన్ లొకేషన్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితురాలిని పట్టుకున్నట్లు చెప్పారు. ఆమెపై సెక్షన్ 326ఏ కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. SHOCKER - ACID ATTACK ON WOMAN & HER CHILD Horrific attack in Nagpur; acid attack on a woman & her child. Reportedly, the attacker had affair with the woman's husband | @Aruneel_S reports #acidattack #BREAKING_NEWS #Nagpur pic.twitter.com/LuLqEhv6gG — Mirror Now (@MirrorNow) December 6, 2022 ఇదీ చదవండి: Bharat Jodo Yatra: బీజేపీ కార్యకర్తలపై రాహుల్ గాంధీ ముద్దుల వర్షం!.. వీడియో వైరల్ -
హైదరాబాద్: ఇద్దరు యువకుల మధ్య అనైతిక సంబంధం
-
హైదరాబాద్ యువకుల అనైతిక సంబంధం.. అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే..!
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో కొత్త కల్చర్ వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువకుల మధ్య అనైతిక సంబంధం స్వలింగ సంపర్కానికి దారితీసింది. అయితే వీరిద్దరిలో ఒకరు అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తనతో నగ్నంగా ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరింపులకు గురిచేశాడు. దీంతో బాధిత యువకుడు ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శాలిబండ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. శాలిబండకు చెందిన ఓ యువకుని భార్య 2017లో మృతిచెందింది. దీంతో అప్పటి నుంచి ఆ యువకుడు ఆన్లైన్లో ట్యూషన్లు చెప్పేవాడు. 2018లో అతనికి మొఘల్‌పురాకు చెందిన మరో యువకుడు పరిచయమయ్యాడు. శాలిబండ యువకుడు ఆకర్షణీయంగా కనిపించాలనే ఉద్దేశ్యంతో మహిళల వస్త్రాలు ధరించేవాడు. దీంతో యువకులు మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. ఇద్దరు స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డారు. 10 లక్షల ఆర్థిక సాయం అనంతరం శాలింబండ యువకునికి మరో యువతితో రెండో పెళ్లి జరిగింది. అయితే విషయాన్ని పసిగట్టిన రెండవ భార్య కొన్నాళ్ళకే అతన్ని వదిలి వెళ్ళిపోయింది. దీంతో మళ్ళీ వీరిద్దరు పీకల్లోడుతు ప్రేమలో మునిగిపోయి సహజీవనం సాగిస్తున్నారు. గత ఫిబ్రవరి నెలలో మొఘల్‌పురాకు చెందిన యువకుడికి ఓ యువతితో వివాహం జరిగే సమయంలో శాలిబండకు చెందిన యువకుడు 10 లక్షల ఆర్థిక సహాయం కూడా చేశాడు. ఇదే అదనుగా భావించిన మొఘల్‌పురా వాసి అడిగినంత డబ్బు ఇవ్వకుంటే తనతో కలిసి ఉన్న సమయంలో సీక్రెట్‌గా తీసిన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరిపులకు గురిచేశాడు. చదవండి: హైదరాబాద్‌లో దారుణం.. 17 బాలికపై ఇద్దరు యువకుల అఘాయిత్యం అప్పట్లో మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా నమోదయ్యింది. ఆ తర్వాత కూడా తనను దగ్గరికి రానివ్వకపోవడంతో మొఘల్‌పురా వ్యక్తి నుంచి రోజు రోజుకు బెదిరింపులు అధికమయ్యాయి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన శాలింబండ యువకుడు మంగళవారం అర్థరాత్రి 40 గుర్తు తెలియని మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అంతేగాక అతనే 100 కంట్రోల్ రూమ్, 108 ఆంబులెన్స్‌కు సమాచారం అందించాడు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అపస్మారక స్థితికి చేరుకున్న యువకున్ని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శాలిబండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహేతర సంబంధం.. దేహశుద్ధి చేసిన భార్య
సాక్షి, హైదరాబాద్: మరో మహిళతో ప్రేమాయణం సాగిస్తూ.. బిడ్డను, తనను నిర్లక్ష్యం చేసిన భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చెప్పులతో కొట్టిందో భార్య. వివరాలు.. మంచిర్యాల జిల్లా కొత్తకమ్ముగూడెం గ్రామానికి చెందిన లక్ష్మణ్‌కు.. సౌజన్య అనే మహిళతో 2010లో వివాహం అయ్యింది. వీరికి ఓ కుమారుడు. ఈ క్రమంలో కొద్ది కాలం క్రితం లక్ష్మణ్‌కు కరీంనగర్ జిల్లా వెంకట్రావు పేటకు చెందిన అనూష అనే మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. కాగా అనూషకు కూడా 2013లో కోలా రవికాంత్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారికి ఓ బాబు కూడా ఉన్నాడు. ప్రస్తుతం అనూష, భర్త రవికాంత్‌ను వదిలిపెట్టి.. లక్ష్మణ్‌తో కలిసి కూకట్‌పల్లిలోని ప్రగతి నగర్లో నివాసం ఉంటుంది. ఈ క్రమంలో లక్ష్మణ్, అనూషల సంబంధం గురించి సౌజన్యకు తెలిసి నిలదీసింది. లక్ష్మణ్, అనూష కలిసి దిగిన ఫోటోలను పెద్దమనుషుల ముందు పెట్టి నిలదీయగా.. అవి గతంలో దిగిన ఫోటోలని.. ప్రసుత్తం తమ ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదన్నాడు లక్ష్మణ్. కొద్ది రోజుల పాటు బుద్ధిగానే ఉన్న లక్ష్మణ్.. తిరిగి అనూషతో తన సంబంధాన్ని కొనసాగించడం ప్రాంరభించాడు. ఈ క్రమంలో సౌజన్య గురువారం లక్ష్మణ్, అనూషలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని.. చెప్పుతీసుకుని చితకబాదింది. -
పక్కింటి కుక్కతో అక్రమ సంబంధం ఉందని..
తిరువనంతపురం: కొన్ని సంఘటనలు చూస్తే.. నవ్వాలో, ఏడ్వాలో అర్థం కాదు. అలాంటి సంఘటనే ఒకటి కేరళలో చోటు చేసుకుంది. ఇష్టంగా పెంచుకుంటున్న కుక్క.. పక్కింటి కుక్కతో అక్రమ సంబంధం పెట్టుకుందనే నెపంతో దాన్ని రోడ్డు మీద వదిలేసి వెళ్లాడో వ్యక్తి. వివరాలు.. నగరంలోని ఓ రద్దీ మార్కెట్ బయట సుమారు మూడేళ్ల వయసున్న పొమరేనియన్ జాతి కుక్క తచ్చాడటం జంతు ప్రేమికుల దృష్టికి వచ్చింది. ఎటు వెళ్లాలో తెలియక బిక్కుబిక్కుమంటున్న ఆ కుక్కను షామిన్ అనే జంతు ప్రేమికురాలు రక్షించి అక్కున చేర్చుకుంది. ఆ సమయంలో కుక్క మెడలో ఆమెకు ఓ ఉత్తరం కనిపించింది. అది చదివిన షామిన్ ఒక్కసారిగా అవాక్కయ్యారు. మలయాళంలో రాసిన ఆ ఉత్తరంలో కుక్కను వదిలేయడానికి గల కారణాలు రాశాడు దాని యజమాని. ఇంతకు లేఖలో ఏం ఉన్నదంటే.. ‘ఇది చాలా మంచి జాతికి చెందిన కుక్క. అందరితో చక్కగా ప్రవర్తిస్తుంది. ఎక్కువ తిండి అవసరం లేదు. దీనికి ఎలాంటి జబ్బులు లేవు. ఐదురోజులకు ఒకసారి స్నానం చేయిస్తే సరిపోతుంది. ఈ మూడేళ్లలో ఇది ఒక్కరిని కూడా కరవలేదు. పాలు, బిస్కెట్లు, గుడ్లు ఆహారంగా ఇవ్వాలి. అప్పుడప్పుడు మొరగడం తప్పించి వేరే సమస్యలేం లేవు. ఇక ఇప్పుడు దీన్ని ఇలా వదిలేయడానికి ఓ కారణం ఉంది. ఇది పక్కింటి కుక్కతో అక్రమ సంబంధం పెట్టుకుంది. అందుకే దీన్ని వదిలేస్తున్నాను’ అని ఉత్తరంలో పేర్కొన్నాడు. ఈ విషయం గురించి షామిన్ మాట్లాడుతూ.. ‘జబ్బు చేస్తేనో.. గాయాలు అయితేనో పెంపుడు జంతువులను వదిలేయడం చూశాం కానీ.. ఇలాంటి సాకుతో వదిలేయడం మాత్రం ఇదే మొదటిసారి. అక్రమ సంబంధం పెట్టుకుందని వదిలేయాడానికి అదేమైన మనిషా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు షామిన్. ఇక నుంచి ఈ కుక్కను తానే పెంచుకుంటానని చెప్పారు. -
వివాహేతర సంబంధానికి అడ్డువస్తాడని..
సాక్షి, రంగారెడ్డి : వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో శివరాంపల్లికి చెందిన ఆనంద్‌ను భార్య మహేశ్వరి ఆమె ప్రియుడు సంజయ్ హత్య చేశారని శంషాబాద్ డీసీపీ తెలిపారు. బుధవారం రాజేంద్రనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆనంద్ హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. డీసీపీ మాట్లాడుతూ.. మే7వ తేదీన ఆనంద్‌ను హత్యచేసిన తర్వాత అతని శవాన్ని అర్థరాత్రి గంధంగూడ మూసీ సమీపంలో పెట్రోల్ పోసి తగలబెట్టారని అన్నారు. అ తర్వాత అస్తికలను మూసీలో కలిపిన నిందితులు ఎవరికీ అనుమానం రాకుండా భర్త కనిపించటం లేదని స్టేషన్లో ఫిర్యాదు చేశారని అన్నారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు హత్య కేసును చేధించి మహేశ్వరి, ఆమె ప్రియుడు సంజయ్‌లను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. అసలేం జరిగింది... వికారాబాద్ జిల్లాకు చెందిన ఆనంద్ 15 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చాడు. 2010లో పురానాపూల్‌కు చెందిన మహేశ్వరిని ప్రేమంచి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ముకేష్ (7) , భాను (5) ఉన్నారు. కొద్ది రోజుల తర్వాత మద్యానికి బానిసైన ఆనంద్ భార్యను పట్టించుకోవటం మానేశాడు. ఆనంద్ స్నేహితుడు సంజయ్ అతన్ని కలవటానికి తరుచుగా ఇంటికి వచ్చిపోతుండేవాడు. ఈ క్రమంలో మహేశ్వరి సంజయ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ అక్రమ సంబంధానికి భర్త ఆనంద్ అడ్డువస్తున్నాడనే కారణంతో అతన్ని చంపాలని పథకం రచించారు. మే నెల 7వ తేదీన మద్యం సేవించి ఇంటికి వచ్చిన ఆనంద్‌ను సంజయ్, మహేశ్వరి ఇద్దరు కలిసి హత్య చేశారు. తర్వాత అతని శవాన్ని అర్థరాత్రి గంధంగూడ మూసీ సమీపంలో పెట్రోల్ పోసి తగులబెట్టారు. రెండు రోజుల తర్వాత భర్త కనిపించడంలేదంటూ మహేశ్వరి రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఆనంద్ భార్యపై అనుమానం వచ్చి ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. -
మిత్రుడిపై అనుమానం.. బండరాయితో బాది..
పుణె : భార్యతో అక్రమసంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో మిత్రుడి తలపై బండరాయితో కొట్టి హత్యచేశాడో వ్యక్తి. ఈ సంఘటన సోమవారం మహరాష్ట్రలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పుణె జిల్లాకు చెందిన మందర్ షిండే, అదే ప్రాంతానికి చెందిన యోగేష్ హరిభౌ దోనే మంచి మిత్రులు. యోగేష్ తరుచూ మందర్ షిండేను ఎగతాళి చేస్తూ మాట్లాడేవాడు. ఓ రోజు యోగేష్ అందరి ముందు మందర్ భార్య గురించి తప్పుగా మాట్లాడటంతో మందర్ అతనిపై కక్ష్య పెంచుకున్నాడు. యోగేష్‌ను మందు తాగటానికి పిలిచి మద్యం మత్తులో ఉండగా అతని తలపై పెద్ద బండరాయితో మోది హత్య చేశాడు. ఈ హత్య చేయటానికి గణేష్ కవాలే, భూషణ్ గైక్వాడ్ అనే ఇద్దరి మిత్రుల సహాయం తీసుకున్నాడు. హత్య అనంతరం ఆ ముగ్గురు శవాన్ని పన్షత్ సమీపంలో పడవేశారు. మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గణేష్ కవాలేపై అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. యోగేష్‌పై ఉన్న కోపంతోనే మందర్ అతన్ని హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. మిగిలిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
బలవంతంగా మూత్రం తాగించారు.. ఆ అవమానంతో...
లక్నో : ఉత్తర ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఆరోపణలతో ఓ యువకుడిపై దాష్టీకానికి పాల్పడ్డారు. పంచాయితీ పెద్దల తీర్పుతో బలవంతంగా అతనితో మూత్రం తాగించగా.. ఆ అవమాన భారంతో అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే... సహారాన్పూర్లోని ఇందిరా కాలనీకి చెందిన యువకుడికి ఓ యువతితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ స్థానికులు దాడి చేశారు. ఈ క్రమంలో పంచాయితీ పెట్టగా.. పెద్దలు దారుణమైన తీర్పు ఇచ్చారు. మహిళలు అతనితో బలవంతంగా మూత్రాన్ని తాగించారు. ఘటన తర్వాత ఇంటికెళ్లిన ఆ యువకుడు ఆత్మహత్యాయత్నం చేయగా.. కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించి కాపాడారు. అసలు ఆ యువతి ఎవరో తనకు తెలీదని.. ఎంత చెబుతున్నా వినకుండా గ్రామస్థులు తనపై దాడి చేశారని అతను చెబుతున్నాడు. తనకు ప్రాణహాని ఉందని చెప్పిన అతను పోలీస్ రక్షణ కోరుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు -
యాంకర్‌తో సంబంధం.. అందుకే కొడుకుపై కేసు?
తనను అసభ్యకరంగా దూషిస్తున్నారంటూ 13 ఏళ్ల బాలుడితో పాటు 70 ఏళ్ల వృద్ధులపై కేసు పెట్టిన యాంకర్ గీతా భగత్ వ్యవహారం సరికొత్త మలుపులు తిరుగుతోంది. తన భర్త మధుకర్‌తో గీతా భగత్ చాలా కాలంగా వివాహేతర సంబంధం పెట్టుకుందని బాలుడి తల్లి శ్వేత ఆరోపించారు. ఆమె తమను గత ఎనిమిదేళ్లుగా మానసికంగా వేధిస్తోందని అన్నారు. వాళ్లిద్దరూ కలిసి ఏదో ఒక రోజు ఆస్తి కోసం తన కొడుకును చంపేస్తారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్తి కోసమే తన కొడుకును టార్చర్ చేస్తున్నారని, ఆ కోపంతో 504, 506, 509 లాంటి సెక్షన్ల కింద కేసు పెట్టారని, 13 ఏళ్ల పిల్లాడికి అసలేం తెలుసని ఇలాంటి కేసులు పెడతారని ఆమె ప్రశ్నించారు. తన భర్తను వాళ్లు పనిమనిషిలా చూస్తున్నారని అన్నారు. తమకు సరిగా న్యాయం చేయకపోతే కొడుకుతో సహా వెళ్లి సనత్‌నగర్ పోలీసు స్టేషన్ ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానని ఆమె హెచ్చరించారు. తన కొడుకును పెద్ద చదువులు చదివించాలని తాను ఆశపడుతున్నానని, కానీ ఇప్పుడు ఈ గొడవల్లోకి వాడిని కూడా లాగి వాడి భవిష్యత్తు నాశనం చేస్తున్నారని వాపోయారు. అంత చిన్న పిల్లాడిపై అసలు క్రిమినల్ కేసు ఎలా పెడతారని శ్వేత తప్పుబట్టారు. గీతాభగత్ తమను మానసికంగా వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుక్కి న్యాయం చేయాలని కోరుతూ ఆమె బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. అయితే బాలుడి తల్లి శ్వేత చేసిన ఆరోపణలపై స్పందించేందుకు యాంకర్ గీతా భగత్ నిరాకరించారు. మార్చి 6వ తేదీన ఇంట్లో పెద్ద గొడవ అయ్యిందని బాలుడు కూడా చెప్పాడు. పోలీసుల ముందే వాళ్లు తన తల్లి శ్వేతను కొట్టారని, అదేంటి కొడుతున్నారని తాను ఆపబోతే.. అసలు వాళ్లను కాదు నిన్ను కొట్టాలంటూ తనను కూడా కొట్టారని చెప్పాడు. ఎప్పుడూ ఏదో ఒక వంక పెట్టుకుని తనను, తన తల్లిని తిడుతుంటారని, అంతేతప్ప తాను ఏరోజూ ఎవరినీ ఒక్క మాట కూడా అనలేదని అన్నాడు. కాగా, తనను దూషించడంతో పాటు అసభ్యకరంగా వ్యవహరించారని గీతాభగత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సనత్‌నగర్ పోలీసులు బాలుడితో పాటు ఇద్దరు వృద్ధులు, శ్వేతపై కేసు నమోదు చేశారు. బాలుడు (13), అతడి తల్లి శ్వేత (36), అమ్మమ్మ రాజకుమారి (74)తో పాటు పక్కింట్లో ఉండే సుబ్బారావు (70)లపై గీతాభగత్ ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు 504, 506, 509, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
వివాహేతర సంబంధం.. మహిళకు బెత్తం దెబ్బలు
వేరే పురుషుడితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కారణంతో ఇండోనేషియాలో ఓ మహిళను బహిరంగంగా బెత్తంతో కొట్టారు. బాధతో ఆమె విలవిల్లాడుతూ గట్టిగా ఏడుస్తుంటే.. చుట్టూ ఉన్నవాళ్లంతా వినోదం చూస్తూ ఉండిపోయారు. ఇండోనేషియాలో ఇస్లామిక్ చట్టాలను కఠినంగా అమలుచేస్తారు. దాని ప్రకారం జూదం ఆడినా, మద్యం తాగినా, వివాహేతర సంబంధాలు పెట్టుకున్నా, స్వలింగ సంపర్కానికి పాల్పడినా కఠినమైన శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. తాజాగా ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులను వివిధ నేరాల కింద పట్టుకున్న అధికారులు.. రాష్ట్ర రాజధాని అయిన బందా అసె ప్రాంతంలో ఓ మసీదు వద్ద అందరూ చూస్తుండగా బెత్తంతో దెబ్బలు కొట్టారు. వాళ్లలో 34 ఏళ్ల మహిళ తన భర్త కాని వ్యక్తితో సంబంధం పెట్టుకుందని ఆమెను తీవ్రంగా కొట్టారు. ఆమెను ఏడుసార్లు బెత్తంతో కొట్టారు. కొట్టిన వ్యక్తి కళ్లు తప్ప మిగిలిన శరీరం మొత్తం దుస్తులతో నిండిపోయి ఉంది. దెబ్బలు కొడుతుంటే తనకు చాలా నొప్పిగా ఉందని ఆమె భరించలేక ఏడ్చేసింది. ఆమెతో సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించిన వ్యక్తికి కూడా ఏడు దెబ్బల శిక్ష విధించారు. 19 ఏళ్ల వయసున్న ఇద్దరు యూనివర్సిటీ విద్యార్థులు కూడా పెళ్లి కాకుండానే లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు వారికి 100 చొప్పున బెత్తం దెబ్బల శిక్ష పడింది. మరోవ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు అతడికి 22 దెబ్బలు పడ్డాయి. అతడి భాగస్వామి గర్భవతి కావడంతో.. ఆమెకు ఇంకా ఏశిక్ష విధించేదీ చెప్పలేదు. సాధారణంగా గర్భిణులకు ఇలాంటి శిక్షల నుంచి మినహాయింపు ఉంటుంది. అసె రాష్ట్రానికి 2001 నుంచి ప్రత్యేక స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటి నుంచి అక్కడ షరియా చట్టం అమలులో ఉంది. -
వివాహేతర సంబంధంతోనే హత్య
యువకుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు ముగ్గురి నిందుతులు అరెస్ట్ చిట్టమూరు : వివాహేతర సంబంధం నేపథ్యంలోనే మండలంలోని కోగిలి పంచాయతీ వడ్డికండ్రిగకు చెందిన మల్లి పాపయ్య హత్యకు గురైనట్లు పోలీసులు మిస్టరినీ ఛేదించారు. ఈ నెల 6న రాత్రి పాపయ్య హత్యకు గురైన విషయం తెలిసిందే. హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు గూడూరు డీఎస్పీ శ్రీనివాస్ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. వడ్డికండ్రిగకు చెందిన మల్లి పాపయ్యకు ఇదే గ్రామానికి చెందిన బెల్లంకొండ చెంచయ్య భార్యతో వివాహేతర సంబంధం ఉందన్నారు. ఈ విషయం తెలిసిన చెంచయ్య పాపయ్య ఎలాగైనా అంతం చేయాలనుకున్నాడన్నారు. అదను కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ నెల 6న పాపయ్య తన తాత సంవత్సరీకానికి పక్కనే ఉన్న వేముగుంటపాళెంకు భార్య, పిల్లలతో వెళ్లాడు. వేముగుంటపాళెంలో కార్యక్రమం అయ్యాక భార్య, పిల్లలను అక్కడే వదలి ఒంటరిగా వడ్డికండ్రిగకు చేరుకున్నాడు. మద్యం సేవించి ఇంట్లో ఒంటరిగా పడుకున్న పాపయ్యను గమనించిన చెంచయ్య తన మేనమామ చెంచుకృష్ణయ్య, స్నేహితుడు సముద్రాలుతో కలిసి పాపయ్యను దిండును ముఖంపై పెట్టి ఊపిరి ఆడకుండా చేశారు. చెంచయ్య ఇనుప రాడ్డుతో పాపయ్య శరీరంపై కొట్టి చీరతో ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. పాపయ్య చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అతని ఒంటిపై ఉన్న బంగారు చైను, ఉంగరం అపహరించారు. ఈ కేసును వాకాడు సీఐ అక్కేశ్వరావు, చిట్టమూరు ఎస్.గోపాల్, సిబ్బందితో కలిసి పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. ప్రాథమికంగా లభించిన ఆధారాలతో నిందితులపై నిఘా ఉంచి గురువారం తాడిమేడు క్రాస్ రోడ్డు వద్ద అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన ఇనుపరాడ్డును, దొంగిలించిన ఉంగరాన్ని చెంచయ్య వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. -
ప్రియురాలిని హతమార్చి తాను ఆత్మహత్య
శ్రీకాళహస్తి: ప్రియురాలిపై అనుమానంతో ఆమెను హతమార్చిన ప్రియుడు, తాను బలవన్మరణానికి పాల్పడిన ఘటన శ్రీకాళహస్తిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వన్‌టౌన్ సీఐ చిన్నగోవిందు కథనం వివరాల ప్రకారం .. కేవీబీపురం వుండలం కళత్తూరుకు చెందిన గుణశేఖర్(38)కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నేళ్ల కిందట అదే మండలం రాయిపేడుకు చెందిన అరుణ(33)తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అరుణ వివాహిత అయినప్పటికీ భర్తతో విబేధాలు వచ్చి ఒంటరిగా ఉంటోంది. ఇటీవల అరుణ మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నట్లు గుణశేఖర్ అనుమానించాడు. దీంతో ఆమెను అంతమొందించాలని పథకం రచించాడు. అందులో భాగంగా శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేటు లాడ్జికి ఆమెను ఆదివారం రాత్రి తీసుకువచ్చాడు. సోమవారం ఆమెను గొంతు బిగించి హతమార్చాడు. మృతి చెందిందని నిర్దారించుకున్న గుణశేఖర్ గదికి తాళం వేసుకుని శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. అక్కడ సోమవారం రాత్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం లాడ్జి గది నుంచి దుర్వాసన వస్తుండంతో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. మంగళవారం పోలీసులు తాళాలు పగలగొట్టి గదిలోకి వెళ్లడంతో అరుణ మృతదేహం రోప్‌కు వేలాడుతూ కనిపించింది. రైల్వేస్టేషన్ ప్రాంగణంలో పట్టాలపై రైల్వే పోలీసులు ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన విషయూన్ని తెలుసుకున్న పట్టణ పోలీసులు అక్కడకు వెళ్లి పరిశీలించారు. మృతుని జేబులో లాడ్జికి చెందిన తాళంచెవి ఉండటాన్ని గుర్తించి కేవీబీపురంలో విచారణ చేపట్టారు. దీంతో హత్యోదంతానికి సంబంధించిన వాస్తవాలు వెలుగుచూశాయి. -
గుంటూరులో వృద్ధుడి దారుణ హత్య
గుంటూరు: పాత గుంటూరులో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధుడిపై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేసి దారుణంగా హతమార్చారు. స్థానిక నవభారత్ నగర్ ఒకటో వీధిలో నివాసముంటున్న సాంబశివరావు(70)ను గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో నరికి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్‌టీం సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. వివాహేతర సంబంధాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. -
వివాహేతర సంబంధం వద్దన్నాడని..భర్త హతం
పాల్వంచ: ఖమ్మంలో దారుణం జరిగింది. చెడు తిరుగుళ్లు మానేయాలని మందలించిన భర్తపై కోపం పెంచుకున్న భార్య అతన్ని గొడ్డలితో నరికి చంపింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పాల్వంచలోని ఇందిరా ప్రియదర్శిని కాలనీలో శనివారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న గోపాలకృష్ణ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన భార్య రాములమ్మ అదే కాలనీకి చెందిన యువకుడితో వివాహేతర సంబంధం నడుపుతోంది. ఈ విషయం తెలిసిన గోపాలకృష్ణ తీరు మార్చుకోవాలని మందలించాడు. అయినా లాభం లేకపోయింది. దీంతో భార్య భర్తల మధ్య తరచు గొడవలు జరుగుతుండేవి. దీనిపై రెండు రోజులుగా భార్య,భర్తల మధ్య తీవ్ర స్థాయిలో వివాదం చెలరేగుతుండగా.. శుక్రవారం రాత్రి భర్త నిద్రిస్తున్న సమయంలో అదును చూసి గొడ్డలితో దాడి చేసి హతమార్చిన రాములమ్మ అక్కడి నుంచి పరారైంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రాములమ్మతో పాటు, ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
వివాహేతర సంబంధంతో వ్యక్తి దారుణ హత్య
ఏటూరునాగారం: వివాహేతర సంబంధం ఓ యువకుడి దారుణ హత్యకు దారి తీసిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఏటూరునాగారం మండలం ఆకుల వారి గణపురానికి చెందిన కేతిరి రమేశ్(23) అనే యువకుడు కొంతకాలంగా తన వదినతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దీంతో ఆమె మామ కేతిరి సమ్మయ్య(55) రమేశ్‌ను శనివారం ఉదయం గ్రామంలోని చెరువు సమీపంలో గొడ్డలితో నరికి చంపాడు. సమ్మయ్య, మృతుడికి సొంత పెదనాన్న. రమేశ్‌ను చంపిన అనంతరం సమ్మయ్య స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. సమ్మయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నారు. -
కోరిక తీర్చలేదని ప్రియుడే కడతేర్చాడు
మెదక్: వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి తన కోరిక తీర్చలేదన్న కోపంతో వివాహితను అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇంచార్జ్ డీఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. పుల్కల్ మండలం లక్ష్మిసాగర్ పంచాయతీ సువాలీ తండాకు చెందిన గోరాం సురేష్, సుశీల (30) దంపతులు సంగారెడ్డిలో అడ్డా కూలీలుగా పనిచేస్తున్నారు. అయితే, బస్వాపూర్ గ్రామానికి చెందిన వెండికోలు రాజు కొంతకాలంగా సుశీలతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. జూన్ 1వ తేదీన సంగారెడ్డిలో పనులకు వెళ్లిన రాజు, సుశీల ఒకే బస్సులో స్వగ్రామానికి వచ్చారు.అదే రోజు సాయంత్రం ముదిమాణిక్యం గ్రామంలో సుశీల, బస్వాపూర్‌లో రాజు బస్సు దిగి వెళ్లిపోయారు. ఆ సమయంలోనే రాజు సుశీలకు ఫోన్ చేసి ముదిమాణిక్యం వద్దనే ఉండాలని ఆమెకు సూచించాడు. అయితే అప్పుడే సుశీలకు భర్త సురేష్ ఫోన్ చేసి.. నడుచుకుంటూ ముందుకు రావాలని, తాను వచ్చి తీసుకెళ్తానని చెప్పాడు. దీంతో వెంటనే ఆమె ఆ విషయాన్ని రాజుకు తెలిపింది. రాజు మాత్రం తాను వచ్చేంతవరకు అక్కడే ఉండాలని పట్టుబట్టాడు. ఆమె వినకుండా ముదిమాణిక్యం నుంచి కిలో మీటరు దూరంలో ఉన్న సువాలీ తండా వైపు నడిచి వెళుతోంది. రాజు ఫోన్ చేస్తుంటే ఆమె కట్ చేసింది. అంతలోనే అక్కడికి బైక్‌పై చేరుకున్న రాజు... ఆమెను అడ్డగించాడు. తన భర్త వస్తున్నాడు వెళ్లిపోవాలని ఆమె ఎంతగా చెప్పినా వినిపించుకోకుండా కోరిక తీర్చాలంటూ గొడవకు దిగాడు. ఆమె ప్రతిఘటించటంతో పక్కనే ఉన్న విద్యుత్ వైరుతో ఆమె గొంతు బిగించి చంపేశాడు. మృతదేహాన్ని దగ్గరలోని బావిలోకి తోసేసి తన ఇంటికి వెళ్లి వెళ్లిపోయాడు. భర్త సురేష్ రాత్రంతా వెతికినా ఆమె ఆచూకీ తెలియలేదు. మరుసటిరోజు ఉదయం తండా మార్గమధ్యంలో భార్య కాలిచెప్పును గుర్తు పట్టి వెతకగా పాడుబావిలో శవమై కనిపించింది. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు మృతురాలి ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితుడిగా వెండికోలు రాజును అనుమానించి విచారించారు. సుశీలతో రెండు నెలలుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు అతడు విచారణలో ఒప్పుకున్నాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. -
యువకుడి అదృశ్యం కేసులో వివాహితే కీలకం ?
► సాయి కోసం కొనసాగుతున్న గాలింపు, దర్యాప్తు ► అతని పాత కేసులపై పోలీసుల దృష్టి ► పోలీసులపై తీవ్ర ఒత్తిళ్లు ► సంబంధీకుల కదలికలపై పోలీసులు ఆరా వైఎస్సార్ జిల్లా: రాజంపేటలో అదృశ్యమైన గాదెరాజు సాయిప్రకాశ్‌రాజు(19) కేసులో ఓ వివాహిత కీలకంగా మారింది. ఈ వివాహితతో సాయికి వివాహేతర సంబంధం ఉందన్న కారణంతో ఆ దిశగా పోలీసులు విచారణ చేపడుతున్నారు. అలాగే ఆ యువకుడి అదృశ్యానికి కారణమైన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ వివాహిత నుంచి పోలీసులు వివరాలు రాబడుతున్నారు. అయితే ఈ వివాహిత గతంలో ఆ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అప్పట్లో ఆమె సన్నిహితులు కొందరు సర్దుబాటు చేసి పంపినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ వివాహితకు పట్టణ పోలీసుస్టేషన్లో కొందరి ఖాకీలకు బాగా సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. అదృశ్యమైన ఆ యువకుడి సన్నిహితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సాయికి సంబంధించిన పాత కేసులపై కూడా పోలీసుల దృష్టి సారించడంతో కొంతమంది ఆందోళనకు గురవుతున్నారు. మిస్సింగ్ కేసు వ్యవహారంలో భారీ స్థాయిలో పోలీసులపై ఒత్తిళ్లు వస్తున్నాయని ఆరోపణలు వెలువడుతున్నాయి. ఏదీ ఏమైనప్పటికి సాయి మిస్సింగ్ కేసు ఏవిధంగా చేధిస్తారన్నది వేచి చూడాల్సిందే. కేసు మిస్టరీని ఛేదించేందుకు చర్యలు గాదెరాజు సాయిప్రకాశ్‌రాజు మిస్సింగ్ కేసును ఛేదించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పట్టణ సీఐ మోహనకృష్ణ తెలిపారు. సోమవారం రాత్రి తన చాంబరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 28న సాయి కనపించడంలేదని అతని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఆ దిశగా గాలింపు చర్యలు చేపడుతున్నామని వివరించారు. త్వరలో ఈ కేసును ఛేదిస్తామని వెల్లడించారు. -
వివాహేతర సంబంధం.. ప్రాణం తీసింది
వివాహేతర సంబంధం దారుణహత్యకు దారి తీసింది. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రేగాటిపల్లె రైల్వేగేట్ సమీపంలో నివాసం ఉండే బాబావలీ (22) ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అతనికి బంధువైన ఓ యువతితో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. పెద్దలు హెచ్చరించినా అతడు తీరు మార్చుకోలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఇంటి ఆవరణలో నిద్రించిన అతడిని గుర్తు తెలియని వ్యక్తులు కొడవలితో గొంతుకోసి చంపారు. వివాహేతర సంబంధం అనుమానంతోనే అతడిని చంపి ఉంటారని బాబావలీ అవ్వ పోలీసులకు ఫిర్యాదుచేసింది. సంఘటన స్థలిని పరిశీలించిన టౌన్ ఎస్సై గణేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సినిమా క్రైం స్టోరీని మించిపోయాడు!
సినిమాల్లో బ్యాడ్ పోలీసులు ఎలా చేస్తారో అచ్చం అలాగే చేశాడా భర్త. వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని.. కట్టుకున్న భార్యను కాల్చి చంపేసి, ఆ విషయం బయటపడకుండా ఉండేందుకు తన రెండు కాళ్ల మీద కూడా పిస్టల్‌తో కాల్చుకున్నాడు. దీంతో పోలీసులు కూడా మొదట్లో అంతా నిజమేననుకున్నారు. కానీ అనుకోకుండా అసలు విషయం తెలిసి ముక్కున వేలేసుకున్నారు. మీరట్- పరీక్షిత్‌గఢ్ రహదారిపై జరిగిన ఈ దారుణం నిజంగా ఎవరో చేసిందేననే అంతా అనుకున్నారు. తాను భార్యతో కలిసి వెళ్తుండగా ఎవరో దుండగులు వచ్చి కాల్పులు జరిపారని, దాంతో ఆమె మరణించిందని, తాను ప్రతిఘటించకుండా ఉండేందుకు తన కాళ్ల మీద కూడా కాల్చేశారని బిజేంద్ర సింగ్ (24) చెప్పాడు. కానీ చివరకు అతగాడి బాగోతం మొత్తం బయటపడింది. పరీక్షిత్‌గఢ్ రోడ్డులో మీరట్ నగరానికి 28 కిలోమీటర్ల దూరంలో బహదూర్‌పూర్ గ్రామం వద్ద ఈ డ్రామా మొత్తం జరిగింది. బిజేంద్ర సింగ్ (24), అతడి భార్య రజనీసింగ్ (30)లపై కాల్పులు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆమె అక్కడికక్కడే మరణించగా, బిజేంద్రను ఆనంద్‌లో ఉన్న ఓ ఆస్పత్రిలో చేర్చారు. అయితే.. దాని గురించిన వివరాలు అడిగినప్పుడు బిజేంద్ర భిన్న కథనాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం మొదలైంది. గ్రామస్తులను విచారిస్తే ఇద్దరి మధ్య ఆరేళ్ల వయసు తేడా ఉందని, భార్యే పెద్దదని తెలిసింది. బిజేంద్రకు చాలామందితో సంబంధాలు ఉన్నా, రజని మాత్రం అతడిని పిచ్చిగా ప్రేమించేది. ఆరోజు బూడిద రంగు శాంత్రో కారు అక్కడ కనిపించిందని, దానికి ఢిల్లీ నంబర్ ప్లేటు ఉందని గ్రామస్తులు చెప్పారు. పోలీసులకు నాలుగు బూడిరంగు కార్లు కనిపించగా, వాటిలో ఒకదానికి ఢిల్లీ నంబర్ ఉంది. వెంటనే కారులో ఉన్న ముగ్గురు యువకులను పట్టుకున్నారు. వాళ్ల దగ్గర రెండు నాటు తుపాకులు, వాడిన లైవ్ కార్ట్రిడ్జులు దొరికాయి. వాళ్లను తమదైన శైలిలో ప్రశ్నిస్తే.. నాటకం అంతా బయటపడింది. వేరే మహిళ మోజులో పడిన బిజేంద్ర.. తన భార్యను అడ్డు తొలగించుకోవాలనే ఇలా చేసినట్లు చెప్పారు. ఇంత నాటకం ఉందని తెలిసిన పోలీసులు ముక్కున వేలేసుకుని.. బిజేంద్రను అదుపులోకి తీసుకున్నారు. -
భర్త లేచిపోయాడన్న ఆవేశంతో భార్య...
జైపూర్: భర్త వివాహేతర సంబంధాలతో ఆ ఇల్లాలు విసిగిపోయింది. ఎన్నిసార్లు చెప్పిచూసినా భర్తలో మార్పురాలేదు. పైగా వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్న అమ్మాయితో కలిసి భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇక అంతే.. ఆ ఇల్లాలి కోపం రెట్టింపయ్యింది. ఏం చేయాలో తోచలేదు. తన ఇద్దరు కుమారులను చంపేసింది. ఆ ఘటన వివరాలిలా ఉన్నాయి... రాజస్థాన్ లోని బన్సవారాకు చెందిన గజేంద్ర అనే వ్యక్తికి సీత అనే మహిళతో ఏడేళ్ల కిందట వివాహమైంది. ఈ క్రమంలో వారికి పప్పు(5), సుభాష్(2) సంతానం కలిగారు. కొన్నేళ్లవరకు అన్యోన్యంగా సాగింది. అయితే గత కొంతకాలం నుంచి వీరి కాపురంలో గొడవలు మొదలయ్యాయి. భర్త గజేంద్ర స్థానిక మహిళతో వివాహేతర సంబంధాలు ఏర్పరుచుకున్నాడు. ఈ విషయంలో తరచుగా భార్యాభర్తల మధ్య కొట్లాట జరిగేది. భర్తను చాలాసార్లు వారించిచూసినా ప్రయోజనం కనిపించలేదు. ఈ క్రమంలో బుధవారం గజేంద్ర, మహిళతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు. ఆ మరుసటిరోజు తన ఇద్దరు చిన్నారుల్ని ఇంటి సమీపంలో ఉన్న బావిలో పడవేసి బంధువుల ఇంటికి వెళ్లింది. పిల్లల్ని చంపేశానని బంధువులకు చెప్పగా వారు శుక్రవారం పోలీసులకు సమాచారం అందించగా వారు కేసు నమోదుచేశారు. బావిలో నుంచి సుభాష్ మృతదేహాన్ని శుక్రవారం తీయగా, పెద్ద కుమారుడు పప్పు మృతదేహం నేడు లభ్యమైందని పోలీసులు తెలిపారు. గజేంద్ర, స్థానిక మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు. -
తల్లిపై కన్నేసి.. విద్యార్థిని కిడ్నాప్‌నకు యత్నం!
పోలీసు అయి ఉండి కూడా.. ఓ విద్యార్థినిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడో ప్రబుద్ధుడు. ఒంగోలు పోలీసు ట్రైనింగ్ కాలేజిలో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న జగన్మోహనరావు ఈ దారుణానికి పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన ఓ విద్యార్థిని తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకోవాలన్న ఆలోచనతో.. ఆమెను కిడ్నాప్ చేయించడానికి ప్రయత్నం చేశాడు. ఒంగోలు లాయర్‌పేటకు చెందిన బ్యూటీపార్లర్ నిర్వాహకురాలు ఈదుపల్లి సుధారాణి సాయంతో ఆ అమ్మాయిని ఎత్తుకెళ్లాలని చూశాడు. అయితే.. అమ్మాయి గట్టిగా కేకలు వేస్తూ స్కూల్లోకి పరిగెత్తింది. దాంతో జగన్మోహనరావు, సుధారాణి అక్కడినుంచి పరారయ్యారు. స్థానికుల సాయంతో చుట్టుపక్కల గాలించగా సుధారాణి వారి చేతికి చిక్కింది. ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వాళ్లు ఆమెను విచారించడంతో అసలు విషయం బయటపడింది. గత సంవత్సరం కూడా ఇలాంటి ఉద్దేశంతోనే అతడు అమ్మాయిని కిడ్నాప్ చేయించేందుకు ప్రయత్నించాడని తెలిసింది. అప్పట్లో ఇరువైపులకు చెందిన పెద్దలు ఒప్పందం కుదుర్చుకోవడంతో అతడు ఊరుకున్నాడు. మళ్లీ ఆమె తల్లిపై కన్నేసి.. అమ్మాయిని కిడ్నాప్ చేయించడానికి ప్రయత్నించాడు. -
తల్లీకూతుళ్లు కలిసి.. తాతను చంపేశారు!
ఒక తప్పు వంద తప్పుల్ని చేయిస్తుంది. అవే చివరికి నేరం చేసేందుకూ కారణమవుతాయి. సినిమా కథకు ఏమాత్రం తగ్గని వాస్తవ గాథ ఇది. జైపూర్‌లో ఓ వృద్ధుణ్నిచంపిన అతని కోడలు, మనమరాలు, మనుమడు, డ్రైవర్‌ను పోలీసులు అరెస్టుచేశారు. దర్యాప్తులో బయటపడ్డ వాస్తవాలు, హత్యకు దారితీసిన పరిస్థితులు చూస్తే కళ్లు తిరగక మానవు.. జైపూర్‌లోని అంబర్ ఏరియాలో మధ్య వయస్కురాలైన ప్రియ తన కూతురు హర్ష (19) కొడుకు (14) తో కలిసి ఉంటోంది. ఉద్యోగార్థం ఆమె భర్త దుబాయ్‌లో ఉంటున్నాడు. ఆమె నివసించే ఇంటికి సమీపంలోనే మామ జవహర్ (భర్త తండ్రి) ఇల్లు ఉంది. కొన్నేళ్లుగా భర్త దూరంగా ఉండటంతో ఒక రకమైన మానసిక స్థితికిలోనైన ప్రియ.. మామ జగదీశ్ తనకు చేతబడి చేయిస్తున్నాడని నమ్మేది. తిరుగుబడి చేయించుకునేందుకు కారు డ్రైవర్ నజీర్‌తో కలిసి ఓ మంత్రగాడి దగ్గరికి వెళ్లింది. అలా తిరుగుబడి పూర్తయ్యేలోపు నజీర్‌తో చనువు పెరిగింది. అదే వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. కొంతకాలమైన తర్వాత ప్రియ కూతురు హర్ష కూడా నజీర్‌కు దగ్గరైంది. దీన్ని గమనించిన జవహర్.. వారిద్దరిపై సీరియస్ అయ్యాడు. విషయం దుబాయ్‌లో ఉన్న కొడుకుకు చెబుతానని బెదిరించాడు. తమ సంతోషానికి అడ్డొస్తున్నాడని భావించిన ప్రియ, ఆమె కూతురు హర్షా.. తమ డ్రైవర్ నజీర్‌తో కలిసి జవహర్ హత్యకు పథకం పన్నారు. గత ఆదివారం కోడలి ఇంటికొచ్చిన జవహర్‌ను ఆ ముగ్గురూ కలిసి తలదిండుతో ఊపిరాడకుండా చేసి చంపేశారు. శవాన్ని కవర్లో చుట్టి బయట పడేసే క్రమంలో 14 ఏళ్ల కొడుకు కూడా వారికి సాయం చేశాడు. చుట్టచుట్టిన శవాన్ని కారులో తీసుకెళ్లి ఓ పాడుబడ్డ క్వార్టలర్సలో పడేశాడు డ్రైవర్ నజీర్. సోమవారం ఉదయం కవర్లో శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. అయితే మామ జగదీశ్ వివాహేతర సంబంధం పెట్టుకోవాలని తనను ఒత్తిడి చేసినందుకే అతణ్ని హత్యచేయాల్సి వచ్చిందని ప్రియ పోలీసులకు చెప్పింది. ప్రస్తుతం ప్రియ, హర్షా, డ్రైవర్ నజీర్ రిమాండ్‌లో ఉన్నారు. 14 ఏళ్ల బాలుణ్ని జునైవల్ హోంకు తరలించారు.