తల్లీకూతుళ్లు కలిసి.. తాతను చంపేశారు! | Minor boy helps sister, mother in killing grand father | Sakshi
Sakshi News home page

తల్లీకూతుళ్లు కలిసి.. తాతను చంపేశారు!

Published Fri, Apr 10 2015 3:50 PM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM

తల్లీకూతుళ్లు కలిసి.. తాతను చంపేశారు! - Sakshi

తల్లీకూతుళ్లు కలిసి.. తాతను చంపేశారు!

ఒక తప్పు వంద తప్పుల్ని చేయిస్తుంది. అవే చివరికి నేరం చేసేందుకూ కారణమవుతాయి. సినిమా కథకు ఏమాత్రం తగ్గని వాస్తవ గాథ ఇది. జైపూర్లో ఓ వృద్ధుణ్నిచంపిన అతని కోడలు, మనమరాలు, మనుమడు, డ్రైవర్ను పోలీసులు అరెస్టుచేశారు. దర్యాప్తులో బయటపడ్డ వాస్తవాలు, హత్యకు దారితీసిన పరిస్థితులు చూస్తే కళ్లు తిరగక మానవు..

జైపూర్లోని అంబర్ ఏరియాలో మధ్య వయస్కురాలైన ప్రియ తన కూతురు హర్ష (19) కొడుకు (14) తో కలిసి ఉంటోంది. ఉద్యోగార్థం ఆమె భర్త దుబాయ్లో ఉంటున్నాడు. ఆమె నివసించే ఇంటికి సమీపంలోనే మామ జవహర్ (భర్త తండ్రి) ఇల్లు ఉంది. కొన్నేళ్లుగా భర్త దూరంగా ఉండటంతో ఒక రకమైన మానసిక స్థితికిలోనైన ప్రియ.. మామ జగదీశ్ తనకు చేతబడి చేయిస్తున్నాడని నమ్మేది. తిరుగుబడి చేయించుకునేందుకు కారు డ్రైవర్ నజీర్తో కలిసి ఓ మంత్రగాడి దగ్గరికి వెళ్లింది. అలా తిరుగుబడి పూర్తయ్యేలోపు నజీర్తో చనువు పెరిగింది. అదే వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. కొంతకాలమైన తర్వాత ప్రియ కూతురు హర్ష కూడా నజీర్కు దగ్గరైంది. దీన్ని గమనించిన జవహర్.. వారిద్దరిపై సీరియస్ అయ్యాడు. విషయం దుబాయ్లో ఉన్న కొడుకుకు చెబుతానని బెదిరించాడు. తమ సంతోషానికి అడ్డొస్తున్నాడని భావించిన ప్రియ, ఆమె కూతురు హర్షా.. తమ డ్రైవర్ నజీర్తో కలిసి జవహర్ హత్యకు పథకం పన్నారు. గత ఆదివారం కోడలి ఇంటికొచ్చిన జవహర్ను ఆ ముగ్గురూ కలిసి తలదిండుతో ఊపిరాడకుండా చేసి చంపేశారు. శవాన్ని కవర్లో చుట్టి బయట పడేసే క్రమంలో 14 ఏళ్ల కొడుకు కూడా వారికి సాయం చేశాడు. చుట్టచుట్టిన శవాన్ని కారులో తీసుకెళ్లి ఓ పాడుబడ్డ క్వార్టలర్సలో పడేశాడు డ్రైవర్ నజీర్. సోమవారం ఉదయం కవర్లో శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. అయితే మామ జగదీశ్ వివాహేతర సంబంధం పెట్టుకోవాలని తనను ఒత్తిడి చేసినందుకే అతణ్ని హత్యచేయాల్సి వచ్చిందని ప్రియ పోలీసులకు చెప్పింది. ప్రస్తుతం ప్రియ, హర్షా, డ్రైవర్ నజీర్ రిమాండ్లో ఉన్నారు. 14 ఏళ్ల బాలుణ్ని జునైవల్ హోంకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement