వివాహేతర సంబంధం.. ప్రాణం తీసింది | auto driver murdered due to illicit relation | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం.. ప్రాణం తీసింది

Published Sat, May 28 2016 8:16 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

వివాహేతర సంబంధం.. ప్రాణం తీసింది - Sakshi

వివాహేతర సంబంధం.. ప్రాణం తీసింది

వివాహేతర సంబంధం దారుణహత్యకు దారి తీసింది. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రేగాటిపల్లె రైల్వేగేట్ సమీపంలో నివాసం ఉండే బాబావలీ (22) ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అతనికి బంధువైన ఓ యువతితో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. పెద్దలు హెచ్చరించినా అతడు తీరు మార్చుకోలేదు.

ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఇంటి ఆవరణలో నిద్రించిన అతడిని గుర్తు తెలియని వ్యక్తులు కొడవలితో గొంతుకోసి చంపారు. వివాహేతర సంబంధం అనుమానంతోనే అతడిని చంపి ఉంటారని బాబావలీ అవ్వ పోలీసులకు ఫిర్యాదుచేసింది. సంఘటన స్థలిని పరిశీలించిన టౌన్ ఎస్సై గణేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement