
సాక్షి, హైదరాబాద్ : కూకట్‌పల్లి జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళుతున్న ఓ కారు అదుపు తప్పి మరో కారును వేగంగా ఢీకొట్టింది. అనంతరం ఆటో, ద్విచక్ర వాహనంపైకి దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న వ్యక్తి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. శుక్రవారం మధ్యాహ్నం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సమీపంలో దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించి, విచారణ చేపట్టారు. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment