రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
Published Tue, Mar 15 2016 11:19 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లి పరిధిలోని ప్రశాంత్‌నగర్‌లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మరణించిన మహిళ వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement