కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం
Published Wed, May 24 2017 1:17 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లి సాయిబాబానగర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక స్ర్కాప్ గోడౌన్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో అగ్రిప్రమాదం జరిగింది. మంటలు ఒక్కసారిగా ఎగిసిపడి పక్కనే ఉన్న మూడు గోదాములకు వ్యాపించడంతో పరిస్థితి భయానకంగా ఉంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. విద్యుత్ వైర్లు తెగి పడటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు.
ఈ మధ్య కాలంలోనే పక్కనే ఉన్న ప్రకాష్ నగర్‌లో కెమికల్ వేస్టేజ్ గోదాముల్లో కెమికల్ రియాక‌్షన్ వల్ల బారీ అగ్ని ప్రమాదం జరగగా.. ఇప్పుడు ఇలా మూడు గొడౌన్‌లలో మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇళ్ల మధ్యలో ఇలాంటి చెత్త గోదాములు ఏర్పాటు చేయడం వల్ల ప్రజల మనుగడకు ముప్పు ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Advertisement
Advertisement