
కూకట్ పల్లి నియోజకవర్గం
కూకట్‌పల్లి నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన మాదవరం కృష్ణారావు దివంగత టిడిపి నేత నందమూరి హరికృష్ణ కుమార్తె, టిడిపి అభ్యర్ధి నందమూరి సుహాసినిపై ఘన విజయం సాదించారు. రెండు తెలుగు రాష్ట్రాల దృష్టిని ఈ నియోజకవర్గం ఆకర్షించింది. కాంగ్రెస్‌ఐ, టిడిపి, తెలంగాణ జనసమితి, సిపిఐల మహా కూటమిలో భాగంగా టిడిపి ఈ సీటు తీసుకుంది. టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా ఫలితం దక్కలేదు.
చంద్రబాబు, కాంగ్రెస్ అదినేత రాహుల్ గాందీలు కలిసి కూకట్‌పల్లితో సహా హైదరాబాద్‌లోని పలు నియోజకవర్గాలలో ప్రచారం చేశారు. అయినా ఓటమి తప్పలేదు. మాదవరం కృష్ణారావు 41049 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. 2014 లో కృష్ణారావు టిడిపి టిక్కెట్‌పై గెలిచి, తదుపరి ఆయన టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఈసారి టిఆర్‌ఎస్ పక్షాన పోటీచేసి గెలిచారు. కృష్ణారావుకు 111612 ఓట్లు రాగా, సుహాసినికి 70563 ఓట్లు వచ్చాయి.
ఇక్కడ నుంచి బిఎస్పి టిక్కెట్ పై పోటీచేసిన హరిశ్చంద్రారెడ్డికి 12 వేలకుపైగా ఓట్లు వచ్చాయి. 2014లో మాధవరం కృష్ణారావు 43186 ఓట్ల ఆదిక్యతతో టిఆర్‌ఎస్ అభ్యర్ధి గొట్టుముక్కల పద్మారావుపై విజయం సాదించారు. 2009లో కూకట్‌పల్లికి ప్రాతినిద్యం వహించిన లోక్‌సత్తా అదినేత జయప్రకాష్ నారాయణ 2014లో ఇక్కడ పోటీచేయలేదు. మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గానికి పోటీచేసి ఓడిపోయారు. రెండువేల తొమ్మిదిలో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఒకసారి కమ్మ సామాజికవర్గం నేత, రెండుసార్లు వెలమ సామాజికవర్గం నేత గెలిచారు.
కూకట్ పల్లి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..