
ఉప్పల్ నియోజకవర్గం
ఉప్పల్ శాసనసభ నియోజకవర్గం నుంచి టిఆర్‌ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన బి.సుభాష్ రెడ్డి తన సమీప టిడిపి ప్రత్యర్ది వీరేందర్ గౌడ్ పై48232 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ 2014లో గెలిచిన బిజెపి నేత ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ 26700పైచిలుకు ఓట్లు తెచ్చుకుని మూడో స్థానానికి పరిమితం అయ్యారు. కాగా వీరేందర్ గౌడ్ మాజీ మంత్రి, మాజీ ఎమ్.పి దేవేందర్‌గౌడ్ కుమారుడు, మహాకూటమిలో భాగంగా టిడిపి ఇక్కడ పోటీచేసినా ఫలితం దక్కలేదు.
సుభాష్‌రెడ్డికి 117281 ఓట్లు రాగా, వీరేందర్ గౌడ్‌కు 69049 ఓట్లు వచ్చాయి. సుభాష్‌రెడ్డి సామాజికవర్గ పరంగా రెడ్డి నేత. 2014లో ఉప్పల్ నియోజకవర్గంలో బిజెపి-టిడిపి కూటమి అభ్యర్ధిగా ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ 14169 ఓట్ల ఆధిక్యతతో విజయం సాదించారు. అప్పుడు టిఆర్‌ఎస్ అభ్యర్ది బి.సుభాష్ రెడ్డి రెండో స్థానంలో ఉండగా, కాంగ్రెస్ మూడో స్థానంలోకి వెళ్లిపోయింది. 2009లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో రెండుసార్లు రెడ్లు, ఒకసారి బ్రాహ్మణ నేత గెలిచారు.
ఉప్పల్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..