Uppal Assembly Constituency
-
TS: బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. మరోవైపు టికెట్ దక్కని ఆశావహులు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ఊహాగానాలు వినవస్తున్నాయి. తాజాగా.. ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి బీజేపీలోకి చేరతారనే ప్రచారం ఊపందుకుంది. ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బండారి లక్ష్మారెడ్డిని అధిష్టానం ఎంచుకుంది. ఆ సమయంలో.. భేతి సుభాష్‌రెడ్డి బహిరంగంగానే తన అసంతృప్తిని వెల్లగక్కారు. ఉద్యమకారుడిని పార్టీ కోసం తొలి నుంచి పని చేస్తున్న తనకు.. అవమానకర రీతిలో టికెట్ కేటాయించకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. అయితే ఎమ్మెల్సీ కవిత హామీతో ఆయన కాస్త చల్లబడ్డారనే అంతా భావించారు. ఆ తర్వాత ఆయన ఎందుకనో అధికారిక కార్యక్రమాల్లో ఆయన పెద్దగా కనిపించలేదు. ఈ లోపు కొందరు అసంతృప్తులకు నామినేటెడ్ పదవులు దక్కగా.. భేతికి మాత్రం మొండి చెయ్యే దక్కింది. ఈ తరుణంలో.. భేతి ఇప్పుడు బీఆర్ఎస్ను వీడి బీజేపీ చేరతారనే ప్రచారం నడుస్తోంది ఇప్పుడు. బీజేపీ అగ్రనేతల నిర్ణయంతో.. భేతితో కమలం నేతల సంప్రదింపులు జరిగాయని తెలుస్తోంది. అంతేకాదు.. భేతిపై సర్వేలు చేయించిన తర్వాతే ఆయన్ని బీజేపీలోకి తీసుకోవాలని బీజేపీ భావిస్తోందని.. ఉప్పల్ బీజేపీ అభ్యర్థిగా ఆయన్నే నిలబెట్టాలని నిర్ణయించిందని సమాచారం. మరో మూడు రోజుల్లో ఆయన లాంఛనంగా బీజేపీలో చేరతారనే మాట బలంగా వినిపిస్తోంది ఇప్పుడు. -
కాంగ్రెసోళ్ల ఫొటో పెట్టుకునోడికి బీఆర్ఎస్ టికెట్టా?
‘‘ఉరి తీసేవాడ్ని కూడా ఆఖరి కోరిక అడుగుతరు. ఒక బలి ఇచ్చేటప్పుడు కూడా నోట్లో నీళ్లు పోస్తరు. అంతకన్నా దారుణంగా నన్ను ట్రీట్ చేసిండ్రు. టికెట్ ఇచ్చే ముందు కనీసం నాతో చర్చింలేదు. ఎమ్మెల్యే అయినాక ఆస్తులు అమ్ముకున్నా. పార్టీతో.. ఎమ్మెల్యే పదవితో లాభం పొందింది లేదు. పార్టీలో దందాలు, గుండాయిజాలు చేసినోళ్లు ఉన్నారు. నిజాయితీగా ఉన్న నాలాంటోడికేమో అన్యాయం జరుగుతోంది. టికెట్ రాకపోవడానికి.. నేనూ వాళ్లలా ఏదైనా తప్పు చేసి ఉండాలా? :::ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన తనకు పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించకపోవడంపై వారం తర్వాత మీడియా ముందుకు వచ్చి అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేశారు ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి. మంగళవారం తన కుటుంబం, అనుచరులతో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ.. ‘‘గ్రేటర్లో ఉన్న ఒకేఒక్క ఉద్యమకారుడ్ని నేను. అలాంటిది నగరంలోని నా ఒక్క సీటే తొలగించడం బాధగా అనిపిస్తోంది. 2001 నుంచి పార్టీలో ఉన్నా. పద్మారావు గౌడ్ నా తర్వాత వచ్చి మంత్రి అయ్యారు. నేను మాత్రం పార్టీ కోసం నిజాయితీగా పని చేస్తూ ఇలాగే ఉండిపోయా. ఎన్నో ఇబ్బందులు పడి ఉప్పల్‌లో పార్టీని కాపాడాను. ఎవరైనా ఎమ్మెల్యే అయ్యాక ఆస్తులు పెంచుకుంటారు. నేను మాత్రం ఆస్తులు అమ్ముకున్నా. అడ్డగోలుగా సంపాదించుకున్న వాళ్లకు టికెట్లు ఇచ్చారు. అసలు బండారు లక్ష్మారెడ్డి(ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి)కి టికెట్ ఎలా ఇస్తారు? ఆయన ఏ జెండా మోశాడు?. కాంగ్రెస్ నేతల ఫొటోలు పెట్టుకున్నోడికి టికెట్ ఎలా ఇస్తారు?. కాంగ్రెస్ నేత అయిన తన అన్న ఫొటో పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నాడు. అలాంటోళ్లకు టికెట్ ఇస్తారా?. అసలు టికెట్ ఇచ్చే ముందు కనీసం నాతో చర్చింలేదు. నేనేం తప్పు చేశా. నన్నెందుకు బలి చేశారు?. టికెట్ ఇవ్వనుందుకు నిరసనగా నా కుటుంబం రోడ్డెక్కి ధర్నా చేద్దామంది. మా క్యాడర్ ఆందోళన చేస్తామంది. నేనే వద్దాన్నా. పార్టీలో ఉన్నాం.. అలాంటి పొరపాట్లు చేయొద్దు అని చెప్పా. వారం రోజులైనా ఇప్పటికీ నన్ను పిలిచి మాట్లాడలేదు. కనీసం ఏ నేత ద్వారా సంప్రదింపులు జరపలేదు. ఏ పార్టీ నుంచి నాకు ఆహ్వానం అందలేదు. మరో వారం వేచిచూసి కార్యకర్తలతో మాట్లాడి తదుపరి నిర్ణయం ప్రకటిస్తా. పార్టీని నమ్ముకుని.. ఇంత మంది భవిష్యత్తును నమ్ముకుని పని చేశా అని సుభాష్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. -
ఉప్పల్ తదుపరి అభ్యర్థి ఎవరు?
ఉప్పల్ నియోజకవర్గం ఉప్పల్ శాసనసభ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన బి.సుభాష్ రెడ్డి తన సమీప టిడిపి ప్రత్యర్ది వీరేందర్ గౌడ్ పై48232 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ 2014లో గెలిచిన బిజెపి నేత ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ 26700పైచిలుకు ఓట్లు తెచ్చుకుని మూడో స్థానానికి పరిమితం అయ్యారు. కాగా వీరేందర్ గౌడ్ మాజీ మంత్రి, మాజీ ఎమ్.పి దేవేందర్‌గౌడ్ కుమారుడు, మహాకూటమిలో భాగంగా టిడిపి ఇక్కడ పోటీచేసినా ఫలితం దక్కలేదు. సుభాష్‌రెడ్డికి 117281 ఓట్లు రాగా, వీరేందర్ గౌడ్‌కు 69049 ఓట్లు వచ్చాయి. సుభాష్‌రెడ్డి సామాజికవర్గ పరంగా రెడ్డి నేత. 2014లో ఉప్పల్ నియోజకవర్గంలో బిజెపి-టిడిపి కూటమి అభ్యర్ధిగా ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ 14169 ఓట్ల ఆధిక్యతతో విజయం సాదించారు. అప్పుడు టిఆర్ఎస్ అభ్యర్ది బి.సుభాష్ రెడ్డి రెండో స్థానంలో ఉండగా, కాంగ్రెస్ మూడో స్థానంలోకి వెళ్లిపోయింది. 2009లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో రెండుసార్లు రెడ్లు, ఒకసారి బ్రాహ్మణ నేత గెలిచారు. ఉప్పల్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..