స్థానిక శ్రీనిధి గార్డెన్‌లో భవనంపై నుంచి కిందపడి ఓ వివాహిత మృతిచెందింది. లాడ్‌లీ అనే మహిళ కుక్కతో అడుకుంటుండగా అది ఒక్కసారిగా ఆమెపైకి దూకింది. కుక్కను తప్పించుకునే క్రమంలో ఆమె ప్రమాదవశాత్తు కింద పడిపోయి మృతిచెందిందని భర్త సాయి ముదిరాజ్ చెబుతున్నారు. కాగా, సాయి ముదిరాజ్ చెబుతున్నదాంట్లో తమకు అనుమానాలున్నాయని లాడ్‌లీ తండ్రి రాజేష్ భండారీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు కూకట్‌పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లాడ్‌లీ అమెజాన్ కంపెనీలో పనిచేస్తున్నారు.