కూకట్‌పల్లిలో వరుస చోరీలు
Published Wed, Jan 25 2017 12:59 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
హైదరాబాద్: కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో పట్టపగలే చోరీ జరిగింది. స్థానిక నాలుగో ఫేజ్‌లో ఉండే రామకృష్ణ ఇంట్లో దొంగలు పడి ఉన్నకాడికి ఎత్తుకెళ్లారు. భార్యాభర్తలు ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కావడంతో.. ఇంటికి తాళంవేసి తమ కార్యాలయాలకు వెళ్లారు. ఇది గమనించిన దొంగలు తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న రూ. 20 వేల నగదు, 5 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. వారం రోజుల వ్యవధిలో ఈ కాలనీలో మూడు చోరీలు జరిగినా పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement