నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీ నగర్, కోఠి, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, చింతల్, గాజులరామారం, బేగంపేటలలో కుండపోత వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల రహదారులు చెరువులను తలపించాయి. రాణిగంజ్ వద్ద భారీ వృక్షం కూలడంతో.. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.