Hyderabad: ఎల్బీనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 50పైగా కార్లు దగ్ధం! | Hyderabad: Massive fire breaks out from timber depot at LB Nagar | Sakshi
Sakshi News home page

Hyderabad: ఎల్బీనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 50పైగా కార్లు దగ్ధం!

Published Tue, May 30 2023 9:40 PM | Last Updated on Wed, May 31 2023 7:06 AM

Hyderabad: Massive fire breaks out from timber depot at LB Nagar - Sakshi

హైదరాబాద్‌: ఎల్బీనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.  ఓ టింబర్‌ డిపోలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని అది దావానంలా వ్యాపించింది. పక్కనే ఉన్న పాత కార్ల  గ్యారేజ్‌ను మంటలు చుట్టుముట్టాయి. పాత కార్ల గ్యారేజ్‌లో మంటలు ఎగిసిపడుతున్నాయి.

ఈ ఘటనలో 50పైగా కార్లు దగ్ధమైనట్లు తెలుస్తోంది. మరొకవైపు టింబర్‌ డిపో పక్కన ఉన్న మల్టీప్లెక్స్‌, అపార్ట్‌మెంట్‌లకు మంటలు వ్యాపించాయి. దాంతో స్థానికులు భయభ్రాంతులకు గురౌవుతున్నారు.  దట్టమైన పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చుట్టుపక్కల వారి ఇళ్లను ఖాళీ అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. నాలుగు ఫైరింజన్లు మంటలను అదుపు చేస్తున్నాయి.
చదవండి: రాజేష్‌ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement