
సాక్షి, హైదరాబాద్ : నగరంలో ఓ వైద్య విద్యార్థిని ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. ఎల్బీనగర్ పరిధిలోని సాగర్‌రింగ్ రోడ్ గల అలేఖ్య టవర్స్‌లో నివాసముంటున్న సాహితీ అనే వైద్య విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అపార్ట్‌మెంట్‌లోని 14వ అంతస్తు నుంచి మంగళవారం మధ్యాహ్నం దూకి ఆత్మహత్య చేసుకుంది. బాల్కనీలో ఉన్న గ్రిల్స్ తొలగించి పై నుంచి దూకినట్లు స్థానికులు చెబుతున్నారు. రఘురాం పద్మ దంపతులకు కుమార్తె అయిన సాహితీ ఉస్మానియా ప్రభుత్వ డెంటల్ కాలేజీలో (బీడీఎస్) నాలుగో సంవత్సరం చదువుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. కూతురు మృతిపై తల్లీదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment