
సాక్షి, హైదరాబాద్: ఆన్‌లైన్ గేమ్‌కు మరో యువకుడు బలి అయ్యాడు. ఎల్బీనగర్‌కు చెందిన జగదీశ్ ఆన్‌లైన్ గేమ్ ఆడి లక్షలాది రూపాయలు నష్టపోయాడు. చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక బలవంతంగా శుక్రవారం తనువు చలించాడు. కాగా.. కొద్ది రోజుల క్రితమే జగదీశ్ చేసిన రూ.16 లక్షల అప్పును తండ్రి తీర్చాడు. అయినా అప్పులు మొత్తం తీరకపోవడంతో మళ్లీ ఆన్‌లైన్ గేమ్ ఆడాడు. దీంతో జగదీశ్ పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయి.. ఏమీ చేయలేని పరిస్థితుల్లో సెల్ఫీ తీసుకొని సూసైడ్‌కు పాల్పడ్డాడు. ఈ వీడియోలో తన ఆత్మహత్యకు గల కారణాలను వివరించాడు. ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (కన్నీరు పెట్టించిన దారుణం.. నేటికి ఏడాది)
Comments
Please login to add a commentAdd a comment