
ఎల్‌బీ నగర్ ఫ్లై ఓవర్(ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఎల్‌బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి ఎల్‌బీ నగర్ రింగ్ రోడ్డు వద్ద ఉన్న ఫ్లై ఓవర్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.మృతున్ని రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లికి చెందిన నరేందర్‌గౌడ్‌గా గుర్తించారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో విరక్తి చెందిన నరేందర్.. ఫ్లై ఓవర్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నరేందర్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.(విషాదం: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు..)