
సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎల్బీనగర్ వద్ద సాగర్ రింగ్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ మంగళవారం అర్ధరాత్రి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది గాయపడగా వారిని వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఇక, ప్రమాదంలో గాయపడిన వారిని యూపీ, బీహార్ వాసులుగా గుర్తించారు. అయితే ఫ్లైఓవర్ అర్ధరాత్రి కూలిపోవడంతో పెను ప్రమాదం తప్పిదని అధికారులు తెలిపారు. పగలు సమయంలో ప్రమాదం జరిగి ఉంటే తీవ్ర ప్రమాదంగా మారి ఉండేది.
ప్రమాదంలో గాయపడిన వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. బైరామల్‌గూడ ఫ్లైఓవర్ వద్దకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందం చేరుకుంది. ప్రమాదంపై ఎన్డీఆర్ఎఫ్ అధికారులు పోలీసులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. కాగా, ఫ్లైఓవర్ కూలిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఇది కూడా చదవండి: నెలాఖరున బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశం