
పోలీసుల అదుపులో అరవింద చౌదరి
నాగోలు: ఓఎల్‌ఎక్స్ ద్వారా సెల్‌ఫోన్ల చోరీలకు పాల్పడుతున్న మహిళను ఎల్‌బీనగర్ పోలీసులు అరెస్టు చేసి అమె నుంచి రూ. 3.40 లక్షల విలువైన సెల్‌పోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎల్‌బీనగర్ డీఐ కృష్ణ మోహన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన అల్లారి భాను అరవింద చౌదరి నగరానికి వచ్చి సరూర్‌నగర్‌లో ఉంటోంది. జల్సాలకు అలవాటు పడిన ఆమె సులువుగా డబ్బులు సంపాదించేందుకు ఓఎల్‌ఎక్స్‌లో సెల్ ఫోన్లు విక్రయించేందుకు ప్రకటనలు ఇచ్చేవారిని సంప్రదించేది. వారిని తాను ఎంచుకున్న ప్రాంతానికి రప్పించి సెల్‌ఫోన్ ఇంట్లో వాళ్ల చూపిస్తానని వస్తానని చెప్పి పరారయ్యేది. ఇదే తరహాలో ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు, సైదాబద్‌లో ఒకరిని మోసం చేసింది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఎల్‌బీనగర్ పోలీసులు మంగళవారం నిందితురాలిని అరెస్టు చేసి అమె నుంచి నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment