
సాక్షి, హైదరాబాద్: నగరంలో మెట్రో సేవలకు సంబంధించి మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. బిజీ రూట్‌గా పేరున్న ఎల్‌బీ నగర్ మార్గంలో హయత్ నగర్ వరకు రూట్‌ను పొడగింపు ఉంటుందని ప్రకటించారు.
మంగళవారం నాగోల్-ఫిర్జాదిగూడ లింక్ రోడ్డు ప్రారంభ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హయత్ నగర్ వరకు మెట్రో పొడగింపు ఉండనుందని తెలిపారు. అంతేకాదు.. నాగోల్-ఎల్‌బీ నగర్ మెట్రో లైన్‌ను అనుసంధానం చేయనున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల తర్వాత రెండో ఫేజ్ పూర్తి చేసి తీరతామని మంత్రి కేటీఆర్ హమీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment