సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని హైదరాబాద్ మెట్రోపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ భవిష్యత్ కోసం భారీగా మెట్రో విస్తరణ చేపట్టాల్సి అవసరం ఉందన్నారు. మెట్రో విస్తరణకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు వేగంగా కార్యక్రమాలు చేయాలని కామెంట్స్ చేశారు.
కాగా, మెట్రో రైల్ మాస్టర్ ప్లాన్‌పై మంత్రి కేటీఆర్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ భవిష్యత్ కోసం భారీగా మెట్రో విస్తరణ అవసరం అని పేర్కొన్నారు. నగరంలో రద్దీ, కాలుష్యం తగ్గాలంటే మెట్రోను విస్తరించక తప్పదన్నారు. విశ్వనగరంగా మారాలంటే ప్రజా రవాణా బలోపేతం కావాలన్నారు. మెట్రో విస్తరణకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు వేగంగా కార్యక్రమాలు చేయాలన్నారు.
48 ఎకరాల భూమిని మెట్రో డిపో కోసం అప్పగించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మరిన్ని కోచ్‌లను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఫీడర్ సేవలను మెరుగుపరచడంతో పాటు ఫుట్‌పాత్‌లను అభివృద్ధి చేయాలన్నారు. మల్టీ లెవల్ కార్ పార్కింగ్ కాంప్లెక్స్‌ల కోసం ఇప్పటికే ఉన్న, ప్రతిపాదిత మెట్రో స్టేషన్‌లకు సమీపంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని కేటీఆర్ ఆదేశించారు. ఇక, మెట్రో రైల్ భవన్‌లో నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: లోక్‌సభలో బండి సంజయ్ భావోద్వేగ కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment