
సాక్షి, హైదరాబాద్: పుట్టిన కూతురిని తనకు చూపించకపోవడంతో మనస్తాపం చెంది తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఎన్టీఆర్ నగర్ నివాసి నక్కా అర్జున్(24) కారు డ్రైవర్. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరి మధ్య కొద్ది రోజుల క్రితం మనస్పర్థలు ఏర్పడ్డాయి. అర్జున్ భార్యకు 9 రోజుల క్రితం పాప పుట్టింది. కూతుర్ని చూసేందుకు అర్జున్ వెళ్తే భార్య చూపించలేదు. దీంతో మనస్తాపం చెందిన అర్జున్ శుక్రవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment