
వాసవి ఆనంద నిలయం గేటెడ్ కమ్యూనిటీ ప్రారంభం లింగోజిగూడ: దక్షిణ భారత్‌లోనే అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటి ప్రాజెక్ట్ ఎల్‌బీనగర్‌లో ప్రారంభమైంది. ఎల్‌బీనగర్ మెట్రోస్టేషన్ వద్ద వాసవి నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా చేపట్టిన ఆనంద నిలయం గేటెడ్ కమ్యూనిటీని ఆదివారం ప్రారంభించారు. శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరించిన ఈ ప్రారంభోత్సవంలో ప్రముఖ సినీ నటులు సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్, శ్రీలీల పాల్గొని సందడి చేశారు.
వాసవి నిర్మాణ సంస్థ చైర్మన్, ఎండీ ఎర్రం విజయ్‌కుమార్, డైరెక్టర్‌లతో కలసి సినీ నటులు ఆనంద నిలయం లోగో, ఎలివేషన్, బ్రోచర్‌లను అవిష్కరించారు. ఈ సందర్భంగా సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్, శ్రీలీలలు మాట్లాడుతూ వాసవి ఆనంద నిలయం ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వాసవి నిర్మాణ సంస్థ చైర్మన్, ఎండీ ఎర్రం విజయ్‌కుమార్ మాట్లాడుతూ ఆనంద నిలయంలో ప్రజల కోసం ఎన్నో సకల సౌకర్యాలు కల్పించనున్నామని అన్నారు. 29.3 ఎకరాలలో 11టవర్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. 3576 ఫ్లాట్లు అందుబాటులోకి రానున్నాయన్నారు.
వీటితో పాటు పిల్లకోసం ఆట స్థలం, బ్యాడ్మింటన్, టెన్నిస్, క్రికె ట్ గ్రౌండ్, జిమ్ వంటి సౌకర్యాలు ఉంటయన్నారు. దక్షిణ భారత్‌లోనే అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ అయిన ఆనంద నిలయంలో అతి తక్కువ ధరకే ప్రజలకు ఫ్లాట్లను అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొగ్గరపు దయానంద్, టూరిజం డవపల్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రాంమోహన్, సంస్థ డైరెక్టర్లు ఎర్రం వైష్ణవి, ఎర్రం వనిత, దివ్య, సౌమ్య, రాజేశ్, అభిషేక్ చంద్రత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment