కలెక్షన్స్‌తో మోత మోగిస్తున్న టిల్లుగాడు.. ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే | Tillu Square Movie OTT Release And 2nd Day Worldwide Box Office Collection Details Inside - Sakshi
Sakshi News home page

Tillu Square Movie Collections: కలెక్షన్స్‌తో మోత మోగిస్తున్న టిల్లుగాడు.. ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే

Published Sun, Mar 31 2024 11:40 AM | Last Updated on Sun, Mar 31 2024 2:03 PM

Tillu Square OTT And 2nd Day Collection Details - Sakshi

'టిల్లు స్క్వేర్‌'తో థియేటర్‌లలో మోత మోగిస్తున్నాడు డీజే టిల్లు గాడు.. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌తో దూసుకుపోతున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. మరోసారి తన డిఫరెంట్ యాటిట్యూడ్ స్టైల్ యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు. భారీ అంచనాలతో థియేటర్‌లోకి వచ్చిన వారిని టిల్లు గాడు విపరీతంగా నవ్వించడమే కాకుండా ఎంటర్​టైన్మెంట్‌ను పంచాడు. అలా బాక్సాఫీస్‌ వద్ద  టిల్లు స్క్వేర్‌తో సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్‌   ర్యాంపేజ్ ఆడించారు.

ఓటీటీలో ఎప్పుడంటే..
ప్రస్తుతం ఐపీఎల్‌ సీజన్‌ నడుస్తున్నా కూడా 'టిల్లు స్క్వేర్‌' హిట్‌ టాక్‌తో దూసుకుపోతుంది. మార్చి 29న వచ్చిన ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టిల్లు స్క్వేర్​ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకుంది. రూ. 15 కోట్లకు పైగానే ఈ సినిమా రైట్స్‌ కోసం వెచ్చించినట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా థియేట్రికల్ రన్‌ నెల రోజులు పూర్తి అయిన తర్వాతే ఓటీటీలోకి రానుంది. అంటే ఏప్రిల్‌ చివరి వారం లేదా మే నెలలోని మొదటి వారంలో తప్పకుండా ఓటీటీలోకి టిల్లుగాడు వస్తాడని టాక్‌ వినిపిస్తుంది. సినిమాకు మంచి టాక్‌ వస్తుంది కాబట్టి మరో 20రోజుల తర్వాత ఓటీటీ ప్రకటన అధికారికంగా రావచ్చు.

'టిల్లు స్క్వేర్‌' కలెక్షన్స్‌
టిల్లుగాడి డీజేకు యూత్‌ బాగా ఫిదా అయ్యారు. దీంతో ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 23.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు మూవీటీమ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రెండు రోజులకు  రూ.45.3 కోట్లు వచ్చినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. రూ.100 కోట్ల గ్రాస్ టార్గెట్‌ పెట్టుకున్న నిర్మాతకు ఈ సినిమా అంతకు మించి కలెక్షన్స్‌ తెచ్చిబెట్టే ఛాన్స్‌ ఉంది.  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.  ఇక నేడు(మార్చి 31) ఆదివారం కాబట్టి మరింత భారీ కలెక్షన్స్‌ వచ్చే ఛాన్స్ ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement