డీజే టిల్లుకు సీక్వెల్‌గా విడుదలైన టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌తో దుమ్మురేపుతుంది. సిద్ధు జొన్నలగడ్డ- అనుపమ పరమేశ్వరన్ అల్లరికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం అదిరిపోయే టాక్‌తో ఈ సినిమా దూసుకుపోతుంది. మొదటి పార్ట్‌కు మించిన ఫన్ ఈ చిత్రంలో ఉండటంతో యూత్‌కు బాగా దగ్గరైంది. తాజాగా ఈ సినిమా కలెక్షన్స్ వివరాలను మేకర్స్ ప్రకటించారు.
సిద్దు తనదైన స్టైల్‌లో వన్ లైనర్ డైలాగ్స్‌తో సినిమాను దడదడలాడించేశాడు. కథకు తగ్గట్టు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా చెలరేగిపోయింది. ఇంకేముంది కేవలం ఆరు రోజుల్లో రూ.91 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చిపడ్డాయి. వంద కోట్ల బెంచ్ మార్క్‌కు దగ్గర్లో ఉంది ఈ చిత్రం. నేటి కలెక్షన్స్‌తో ఆ మార్క్‌ను బీట్ చేసే ఛాన్స్ ఉంది. సినిమా ఫస్ట్ షాట్ నుంచి చివరి షాట్ దాకా సిద్ధూ విశ్వరూపం చూపించాడని చెప్పవచ్చు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రాన్ని మల్లిక్ రామ్ డైరెక్టె చేశారు. ఈ మూవీలో సిద్ధు హీరో పాత్రతో పాటు రచన, స్క్రీన్‌ప్లేలో భాగమయ్యారు.
ఓటీటీలో ఎప్పుడంటే..
మార్చి 29న విడుదలైన 'టిల్లు స్క్వేర్' హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టిల్లు స్క్వేర్ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. రూ. 15 కోట్లకు పైగానే ఈ సినిమా రైట్స్ కోసం వెచ్చించినట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా థియేట్రికల్ రన్ నెల రోజులు పూర్తి అయిన తర్వాతే ఓటీటీలోకి రానుంది. అంటే ఏప్రిల్ చివరి వారం లేదా మే నెలలోని మొదటి వారంలో తప్పకుండా ఓటీటీలోకి టిల్లుగాడు వస్తాడని టాక్ వినిపిస్తుంది.
#TilluSquare Double Blockbuster Run at the box-office is unstoppable, grosses over 𝟗𝟏 𝐂𝐑 𝐢𝐧 𝟔 𝐃𝐚𝐲𝐬! 💥
— Sithara Entertainments (@SitharaEnts) April 4, 2024
All set to cross 𝟏𝟎𝟎𝐂𝐑 𝐆𝐫𝐨𝐬𝐬 Mark!! 🔥😎
Our Starboy 🌟 shattering records all over! 🤘
- https://t.co/vEd8ktSAEW pic.twitter.com/lb0pYUwib4
Comments
Please login to add a commentAdd a comment