ఫైల్ ఫోటో
సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగరంలో నాలాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఏమాత్రం ఆజాగ్రత్తగా ఉన్నా.. తెరుచుకుని ఉన్న నాలా మనుషులను మిగేస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో అధికారులు నిర్లక్ష్యం మరో మహిళను బలితీసుంది. ఉదయం నడకకు వెళ్లి ప్రమాదవశాత్తు నాలాలో పడిన సరోజ శవమై తేలారు. స్థానికులు అందించిన సమాచారం ప్రకారం.. సరూర్ నగర్ చెరువు కింద ఉన్న శారదా నగర్ కి చెందిన సరోజ తెల్లవారుజామున ఉదయం ఆరుగంటల సమయంలో ఇంటి నుంచి వాకింగ్‌కు వెళ్లారు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు నాలాలో పడి కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హుటాహుటిన ఎన్‌డీఆర్‌ఎఫ్ టీమ్‌ను, పోలీసులను, జీహెచ్‌ఎంసీ సిబ్బందిని అప్రమత్తం చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
అప్పటికే ఆలస్యం కావడంతో ఆమె మృతి చెందారు. చైతన్యపురిలోని హనుమాన్‌నగర్ నాలలో మృతదేహం లభ్యంమైంది. మృతదేహాన్ని వెలికితీసిన సిబ్బంది పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఇటీవల హైదరాబాద్ నగరంలో భారీగా వర్షాలు కురవడంతో నాలాలు ప్రమాదకరంగా మారిన విషయం తెలిసిందే. ఇక తాజా ఘటన నేపథ్యంలో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ప్రమాదాలు వరుసగా సంభవిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment