Open nala
-
నాలాలో జారిపడి లోకేష్ మృతి
క్రైమ్: బెంగళూరులో అండర్‌పాస్‌లో కారు చిక్కుకుపోయి ఇన్ఫోసిస్ టెక్కీ భానురేఖ(23) మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే.. రాజధానిలోనే మరో విషాదం చోటు చేసుకుంది. ఓపెన్ నాలాలో జారి పడి ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. నాలాలో పడి కొట్టుకుపోయి మృతి చెందిన వ్యక్తిని లోకేష్(32గా గుర్తించారు పోలీసులు. నాలా ప్రవాహంలో ఐదు కిలోమీటర్ల దూరం మృతదేహం కొట్టుకుపోగా.. చివరకు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. ఆదివారం కెంపపుర ప్రాంతంలో నాలాలోకి లోకేష్ జారిపడిపోయాడు. అప్పటికే వర్షంతో నాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో.. ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోయాడు. అలా ఐదు కిలోమీటర్ల దూరం కొట్టుకుని పోగా.. మైసూర్ రోడ్‌లోని బైటరాయణపుర వద్ద మృతదేహాన్ని పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. అయితే.. లోకేష్ నాలాలో దిగే ప్రయత్నంలోనే కొట్టుకునిపోయి ఉంటాడని పోలీసులు చెప్తుండగా, కుటుంబ సభ్యులు మాత్రం పోలీసుల వాదనను కొట్టిపారేస్తూ లోకేష్ జారిపడి వరద ఉధృతికి కొట్టుకుపోయాడని చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి కెంపపుర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు అయ్యింది. దర్యాప్తు కొనసాగుతోంది. #WATCH | Karnataka: A 32-year-old man in Bengaluru, identified as Lokesh, died after drowning in a stormwater drain after allegedly slipping and falling in it. His body was found 5km away from the spot. A case of unnatural death registered at Kempapura Agrahara Police Station. pic.twitter.com/glphoAAU0m — ANI (@ANI) May 23, 2023 -
కుత్బుల్లాపూర్: ఆరు రోజులాయె.. అతనెక్కడా..?
సాక్షి, కుత్బుల్లాపూర్: నాలాలో పడి గల్లంతైన వ్యక్తి జాడ ఆరు రోజులు గడుస్తున్నా లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 25వ తేదీన రాత్రి 7 గంటలకు కుత్బుల్లాపూర్ గ్రామంలోని సీపీఆర్ కాలనీలోని తన ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన మోహన్‌రెడ్డి స్థానికంగా ఉన్న రాయల్ వైన్స్‌లో తన తోటి స్నేహితులు మురళికృష్ణారెడ్డి, వెంకట్‌రెడ్డిలతో మద్యం సేవించి ఇంటికి బయల్దేరుతున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే భయంతో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన తోటి స్నేహితులు మరుసటి రోజు వరకు కుటుంబ సభ్యులకు తెలుపకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో 26వ తేదీ ఆదివారం సాయంత్రం జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించిన మోహన్‌రెడ్డి భార్య భార్గవి తన భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపడుతున్న ఈ క్రమంలో వైన్స్ దుకాణం వద్ద జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పటికే నాలాలో పడి అదృశ్యమైన మోహన్‌రెడ్డి ఆచూకీ దొరకడం కష్టంగా మారింది. చదవండి: ఘరానా దొంగ: కారులో రెక్కీ.. ఇళ్లలో చోరీ కొంపముంచిన కక్కుర్తి... ► కుత్బుల్లాపూర్ గ్రామంలోని నాలాకు ఆనుకొని ఉన్న రాయల్ వైన్స్ నిర్వాహకుల కక్కుర్తి వల్ల వ్యక్తి అదృశ్యానికి కారణమైంది. వైన్స్ షాప్‌లో లభ్యమయ్యే వ్యర్థాలను పడేసే విధంగా గ్రేటర్ అధికారులు ఏర్పాటు చేసిన కంచెను తొలగించారు. గత రెండేళ్లుగా ఇదే తరహాలో చెత్తను వేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మద్యం సేవించి ఇంటికి వెళ్తున్న మోహన్‌రెడ్డి అకస్మాత్తుగా నాలాలో పడి కొట్టుకుపోవడం ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ► అంతేకాకుండా కేసు విషయాలను తెలుసుకునేందుకు గురువారం కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత సర్కిల్ ఉప కమిషనర్ మంగతాయారు ముందే చెత్త వేస్తున్న విషయాన్ని గుర్తించి రూ.లక్ష జరిమానా వేయడం విశేషం. చదవండి: ఉన్నతాధికారులతో పరిచయాలు.. రూ. 10 కోట్లతో వ్యాపారి అదృశ్యం బాధ్యులెవరు..? ►సెప్టెంబర్ 25వ తేదీన రాత్రి 7 గంటల సమయంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మోహన్ రెడ్డి సమీపంలో ఉండే స్నేహితులు మురళీకృష్ణారెడ్డి, వెంకట్ రెడ్డి ముగ్గురు కలిసి మద్యం షాప్‌కు వెళ్లారు. ► అదే రోజు రాత్రి మోహన్‌రెడ్డి నాలాలో పడి గల్లంతవ్వగా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయారు. సంఘటన జరగగానే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు అటు పోలీసులకు చెప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ► సమీపంలో ఉన్న సీసీ ఫుటేజీ ఆధారంగా గమనిస్తే మోహన్‌రెడ్డి జారిపడుతున్న క్రమంలో పక్కనే మరో వ్యక్తి అక్కడి నుంచి వెళ్తున్న దృశ్యం పోలీసులు గుర్తించారు. ► కాగా కింద పడే క్రమంలో ఎవరైనా తోసేశారా? లేదా ప్రమాదవశాత్తు పడిపోయాడా? అన్న విషయంపై స్పష్టత కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ► మూడు రోజుల తర్వాత మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. ► శనివారం రాత్రి వర్షం ఓ మోస్తరుగా ఉండగా ఆదివారం సోమవారం కుండపోత వర్షం పడింది. ► ఈ క్రమంలో గల్లంతైన మోహన్ రెడ్డి అందులో కొట్టుకుపోయి ఉంటాడని బీఆర్ఎఫ్ బృందం సభ్యులు తెలిపారు. జల్లెడ పడుతున్న పోలీసులు... ► మోహన్‌రెడ్డి ఆచూకీ కోసం జీడిమెట్ల సీఐ బాలరాజు నేతృత్వంలో బీఆర్ఎఫ్ బృందం కుత్బుల్లాపూర్, వెంకటేశ్వరనగర్, గణేష్‌నగర్, పాపయ్యయాదవ్ నగర్, హెచ్ఏఎల్ కాలనీ, బాలానగర్ తదితర ప్రాంతాల వరకు విస్తరించి ఉన్న నాలా వెంట గాలింపు ముమ్మరం చేశారు. ► ఇదే విషయంపై కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత తమ సిబ్బందితో గాలింపులో పాల్గొన్నారు. ► విషయాన్ని గోప్యంగా ఉంచడం మూలంగా అతడి ఆచూకీ కనుక్కునే పరిస్థితి ఈ విషయంలో జాప్యం జరుగుతుందని ఇన్స్పెక్టర్ బాలరాజు ‘సాక్షి’తో అన్నారు. -
అధికారుల తీరును ఏమనాలా!
మూసాపేట: బాలాజీనగర్ డివిజన్ ఆంజనేయనగర్‌లో రూ.లక్షలు వెచ్చించి ఓపెన్ నాలాను నిర్మిస్తున్నారు. వర్షాకాలం దృష్ట్యా వరదనీరు సాఫీగా వెళ్లేందుకు ఈ నాలా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే.. ఈ రోడ్డులో ఇప్పటికే ఉన్న నాలాలో వర్షపు నీటితో పాటు డ్రైనేజీ నీరు కూడా పారుతోంది. ఈ నాలాను ఇటీవల కొద్ది భాగం మరమ్మతులు చేయించారు. ఇది వరకే ఓ నాలా ఉండగా మరో నాలాను ఎందుకు నిర్మిస్తున్నారో అని స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పాత నాలాతో పోల్చుకుంటే వెడల్పు, లోతు కూడా తక్కువగానే ఉన్నాయి. అందులో నాలా కల్వర్టు వద్ద 300 ఎంఎం డయా మంచినీటి పైపులైను వెళ్లడంతో నీరు సాఫీగా వెళ్లేందుకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. ఆంజనేయనగర్‌లో రంగనాయక స్వామి దేవాలయం కాంపౌండ్ వాల్ నుంచి ఓపెన్ నాలా ఉంది. ఎండాకాలంలో ఆలయం కాంపౌండ్ వాల్ నుంచి పాపనాశేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే రహదారి వరకు మరమ్మతులు చేశారు. ఆంజనేయనగర్‌కు వెళ్లే రహదారి వరకు కనీసం నాలాలో పూడిక తీయకపోగా రాళ్లు రప్పలతో నిండిపోయింది. రహదారి నుంచి నాలాలో డ్రైనేజీ నీరు పారుతోంది. కనీసం ఇక్కడ పూడికతీత పనులు కూడా చేయలేదు. చిన్నపాటి వర్షం వచ్చినా నాలా పొంగి రోడ్డుపై ప్రవహించే అవకాశం ఉంది. ఇక్కడ పాత ఓపెన్ నాలానే పూడిక తీసి మరమ్మతులు తీస్తే సరిపోతుందని కొత్త లైను అవసరం లేదంటూ స్థానికులు పేర్కొంటున్నారు. కొత్తలైను కూడా పాతలైను ఉన్నంత వరకు కాకుండా మధ్యలోనే పాపనాశేశ్వరం ఆలయంకు వెళ్లే దారి వద్ద పాత నాలాలోనే కలుపుతున్నారు. ఇంత వరకే కొత్తలైను వేయాల్సిన అవసరం ఎంటోనని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పై నుంచి వచ్చే వర్షపు నీరు పాత నాలాలో సరిపోవటం లేదని అనుకున్నా కొత్త లైను పూర్తిగా వేయాలి. కానీ మధ్యలోనే పాతలైనులో కలపటంతో అననుమానాలకు దారి తీస్తోంది. కొత్త లైన్లో కల్వర్టు వద్ద నాలాలో 300 ఎంఎం డయా మంచినీటి పైపులైను వెళ్లటంతో నాలాలో నీరు వెళ్లేందుకు అవకాశం లేదు. కొద్దిపాటి వ్యర్థాలు అడ్డుపడినా వరద, మురుగు రోడ్డుపై ప్రవహిస్తోంది. రోడ్డుపై ప్రవహించకుండా చర్యలు.. వర్షపు నీటికి పాత లైను సరిపోక పోవటంతో కొత్తది నిర్మిస్తున్నాం. పాపనాశేశ్వర స్వామి ఆలయం వద్ద టీ– జంక్షన్ ద్వారా నీటిని కొత్త నాలాలోకి మళ్లించి రోడ్డుపై ప్రవహించకుండా చర్యలు తీసుకుంటున్నాం. -శ్రీదేవి, డీఈ -
ఏమాత్రం ఆజాగ్రత్తగా ఉన్నా..
-
మరో మహిళను మింగేసిన నాలా
సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగరంలో నాలాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఏమాత్రం ఆజాగ్రత్తగా ఉన్నా.. తెరుచుకుని ఉన్న నాలా మనుషులను మిగేస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో అధికారులు నిర్లక్ష్యం మరో మహిళను బలితీసుంది. ఉదయం నడకకు వెళ్లి ప్రమాదవశాత్తు నాలాలో పడిన సరోజ శవమై తేలారు. స్థానికులు అందించిన సమాచారం ప్రకారం.. సరూర్ నగర్ చెరువు కింద ఉన్న శారదా నగర్ కి చెందిన సరోజ తెల్లవారుజామున ఉదయం ఆరుగంటల సమయంలో ఇంటి నుంచి వాకింగ్‌కు వెళ్లారు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు నాలాలో పడి కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హుటాహుటిన ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌ను, పోలీసులను, జీహెచ్ఎంసీ సిబ్బందిని అప్రమత్తం చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటికే ఆలస్యం కావడంతో ఆమె మృతి చెందారు. చైతన్యపురిలోని హనుమాన్‌నగర్ నాలలో మృతదేహం లభ్యంమైంది. మృతదేహాన్ని వెలికితీసిన సిబ్బంది పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఇటీవల హైదరాబాద్ నగరంలో భారీగా వర్షాలు కురవడంతో నాలాలు ప్రమాదకరంగా మారిన విషయం తెలిసిందే. ఇక తాజా ఘటన నేపథ్యంలో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ప్రమాదాలు వరుసగా సంభవిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
‘ఆ ప్రాంతంలో ఒక్క సీసీ కెమెరా కూడా లేదు’
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమకు కడుపుకోత మిగిలిందని సుమేధ కపూరియా తల్లిదండ్రులు సుకన్య, అభిజిత్ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగొద్దని అన్నారు. ఆదివారం వారు ‘సాక్షి’తో మాట్లాడారు. ‘మా కూతురు ప్రాణాలు కోల్పోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణం. సుమేధ మృతిపై మానవ హక్కుల సంఘం స్పందించినందుకు ధన్యవాదాలు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాలా మూసివేయాలి. మా కూతురు మరణంపై అనుమానం వ్యక్తం చేస్తున్న వారు ఆలోచించుకోవాలి. తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఇలా మాట్లాడుతున్నారు. నాలా కారణంగానే మా బిడ్డ మరణించడం అధికారుల వైఫల్యం కాదా? అభివృద్ధి చేయలేనప్పడు ట్యాక్సులు ఎందుకు వసూలు చేస్తున్నారు. మా కూతురు ప్రాణాలు ఎవరు తీసుకొస్తారు. కాలనీలో ఒక్క సీసీ కెమెరా లేదు. ఘటన జరిన ప్రాంతంలో చుట్టుపక్కల ఒక్క సీసీ కెమెరా ఏర్పాటు చేయకపోవడం బాధ్యతారాహిత్యం కాదా?’అని సుమేధ తల్లిదండ్రులు ప్రశ్నించారు. కాగా, నేరెడ్మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాకతీయ నగర్లో నివాసముండే 12 ఏళ్ల సుమేధ సైకిల్ తొక్కుకుంటూ బయటికెళ్లి ప్రమాదవశాత్తూ ఓపెన్ నాలాలో పడిపోడంతో ప్రాణాలు విడిచింది. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. వరద ఉధృతికి సుమేధ మృతదేహం స్థానికంగా ఉండే బండ చెరువుకు కొట్టుకెళ్లింది. (చదవండి: ఉసురు తీసిన నాలా ) -
ఓపెన్ నాలాలో పడి ఒకరు మృతి
కూకట్పల్లి: కూకట్పల్లి పరిధిలోని ప్రశాంత్‌నగర్ ఓపెన్ నాలాలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇందిరా గాంధీ బస్తీకి చెందిన కురుమయ్య(40) క్రేన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన శుక్రవారం ప్రమాదవశాత్తూ ఓపెన్ నాలాలో పడి మృతి చెందాడు. అయితే అతను అనారోగ్యంతో ఉన్నాడని, ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయి ఉండొచ్చని పోలీసులు అంటున్నారు. కాగా, అధికారుల నిర్లక్ష్యంతోనే తమ వ్యక్తి చనిపోయాడని ఆరోపిస్తూ మృతదేహంతో అతని బంధువులు ఆందోళనకు దిగారు. అధికారులు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.