
సాక్షి, హైదరాబాద్: ఇంటి పైకప్పు రేకులపై పడిన చెప్పును తీసుకోబోయిన ఓ యువకుడు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ విషాద ఘటన గురువారం హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... భాగ్యలతలోని శాంతినగర్‌లో నివసించే రిచ్‌పాల్ కొడుకు రాహుల్ (18) జ్యువెలరీ షాపులో పని చేస్తున్నాడు. గురువారం ఉదయం రాహుల్ చెప్పు తన ఇంటి మొదటి అంతస్తులోని రేకుల షెడ్డుపై పడింది.
అల్యూమినియం రాడ్డుతో దానిని తీసేందుకు యత్నించగా అది పొరపాటున పక్కనే ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో విద్యుత్ షాక్‌కు గురైన రాహల్ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతడ్ని వనస్థలిపురంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: ప్రేమ పేరుతో మోసం.. ఆరు నెలలుగా ప్రేమ.. శారీరకంగా లొంగదీసుకొని..
Comments
Please login to add a commentAdd a comment