సాక్షి, హైదరాబాద్ : ఎల్బీనగర్‌లోని షైన్ హాస్పిటల్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం ఘటనలో ఎండీ సునీల్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఆయనతో పాటు సిబ్బందిని కోర్టులో హాజరు పరిచి అక్కడి నుంచి రిమాండ్‌కు తరలించారు. విచారణలో భాగంగా పోలీసులు పలు కీలక అంశాలు వెల్లడించారు. ప్రమాదం జరిగిన నాల్గవ అంతస్తుకు అనుమతి లేదని, అగ్ని మాపక శాఖ నుంచి ఎన్‌వోసీ సర్టిఫికెట్‌ను కూడా తీసుకోలేదని తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా పరిశీలించినట్లు పోలీసులు వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్ జరిగి ఫ్రిజ్ వద్ద పేలుడు జరిగి ఆ మంటలు మొత్తం నాలుగో అంతస్తుకు వ్యాపించినట్లు సీసీ టీవి ఫుటేజీల్లో రికార్డైంది. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న హెడ్ నర్స్ బయటకు వెళ్లడం, సిబ్బంది ఎవరు లేకపోవడంతో చిన్నారులు మంటల్లో చిక్కుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఎండీ సునీల్‌తో పాటు మరో నలుగురి సిబ్బందిపై కేసును నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment