సాక్షి, మైదరాబాద్: నగరంలోని ఎల్బీ స్టేడియంలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం వివిధ శాఖల అధికారులతో కలిసి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. క్రిస్మస్ వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు.
పలువురికి అవార్డులను అందజేయడంతో పాటు క్రైస్తవులతో కలిసి సీఎం కేసీఆర్ డిన్నర్ చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీలు వాణీదేవి, రాజేశ్వర్‌రావు, నగర మేయర్ విజయలక్ష్మి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజుసాగర్, నగర సీపీ సీవీ ఆనంద్ పాల్గొన్నారు.
పూల ఆంథోనికి మంత్రి కొప్పుల ఆహ్వానం..
రాంగోపాల్‌పేట్: క్రిస్మస్ వేడుకలకు హైదరాబాద్ ఆర్చ్ డయాసిస్ బిషప్, కార్డినల్ పూల ఆంథోనిని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆహ్వానించారు. మంగళవారం ఎస్పీ రోడ్‌లోని బిషప్ హౌజ్‌లో ఆయనను మంత్రి కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment