మహబూబ్నగర్ జిల్లాలో ప్రైవేట్ బస్సు దగ్ధమైన నేపథ్యంలో పలు జిల్లాలలో రవాణ ఆధికారులు ప్రైవేట్ బస్సులపై దాడులు నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (డీటీసీ) శ్రీదేవి ఆధ్వర్యంలో గత అర్థరాత్రి నుంచి దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న13 బస్సులను సీజ్ చేశారు. ఏలూరు - 6,తణుకు -2, తాడేపల్లిగూడెం -3, భీమవరం-2 బస్సులను సీజ్ చేసినట్లు డీటీసీ శ్రీదేవి వెల్లడించారు.
అయితే తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 2 బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. మహబూబ్నగర్ జిల్లాలోని కొత్తకోట మండలం పాలెం వద్ద బుధవారం తెల్లవారుజామున బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సు దగ్ధమైంది. ఆ ఘటనలో 45 మంది అగ్నికి ఆహుతి అయ్యారు. మరో ఐదుగురు మాత్రం ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే.