
సాక్షి, హైదరాబాద్: కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నిజాంపేట పరిధిలోని హోలిస్టిక్ ఆస్పత్రి గ్రౌండ్‌ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా ఆస్పత్రిలో దట్టమైన పోగలు వ్యాపించాయి. వెంటనే ఆస్పత్రి సిబ్బంది ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన సిబ్బంది.. రోగులను హుటాహుటిన వేరే ఆస్పత్రులకు తరలించారు. ఫైర్ సిబ్బంది 5 ఫైరింజన్‌లతో మంటలను అదుపులోనికి తెస్తున్నారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు అధికారులు భావిస్తున్నారు. దాదాపు 20 అంబులెన్స్‌లను ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేశారు. స్థానికుల సహయంతో అధికారులు సహయక చర్యలను ముమ్మరం చేశారు. అర్ధరాత్రి ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment