లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు | Private Travels bus truck collision | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 28 2016 9:32 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

వేగంగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన ఘటనలో బస్సు డ్రైవర్, క్లీనర్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా పెద్దమందడి మండలం మోజెర్ల స్టేజీ సమీపంలో 44వ జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సాయంతో బస్సును పక్కకు తీసి ట్రాఫిక్ సమస్య లేకుండా చూశారు. ప్రయాణికులను మరో బస్సులో బెంగళూరుకు పంపించారు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement