ప్రయాణికులకు తప్పిన ప్రమాదం
మార్కాపురం: ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లిన సంఘటన ఆదివారం రాత్రి ప్రకాశం జిల్లా మార్కాపురం–కుంట మధ్య జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మార్కాపురం నుంచి బెంగళూరు వెళ్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కొట్టాలపల్లి గ్రామ మూల మలుపు తిరగగానే ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పొలాల్లోకి వెళ్లిపోయింది.
ఆ సమయంలో బస్సులో ఉన్న ఎనిమిది మంది ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే, డ్రైవర్ వెంటనే బ్రేక్ వేయడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. సంఘటనాస్థలాన్ని మార్కాపురం రూరల్ ఎస్‌ఐ అంకమ్మరావు తన సిబ్బందితో వెళ్లి పరిశీలించారు.


