విశాఖపట్నం: జాతీయరహదారిపై నక్కపల్లి సమీపంలో ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరో 14 మంది తీవ్రగాయాల పాలయ్యారు. డ్రైవరు అతి వేగంగా బస్సును నడపడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. పార్వతీపురం నుంచి గుంటూరు వెళ్తున్న సాయికృష్ణ ప్రైవేటు ట్రావెల్ బస్సులో సుమారు 40 మంది ప్రయాణిస్తున్నారు. వీరంతా వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేందుకు పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లిలలో బస్సు ఎక్కారు.
బస్సు అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో నక్కపల్లి దాటిన తర్వాత కిలోమీటరు దూరంలో మనబానవానిపాలెం రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టినట్లు ప్రయాణికులు తెలిపారు. అనకాపల్లిలో జరిగిన వివాహానికి హాజరై తిరిగి వెళ్తున్న విజయవాడ సమీపంలో గొల్లపూడి గ్రామానికి చెందిన బైపాన రమేష్ (35) బస్సులోనే చిక్కుకుని అక్కడికక్కడే మరణించారు. ఇదే ప్రమాదంలో ఆయన భార్య బైపాన కుమారి, కుమారుడు మోక్షిత్ (ఆరు నెలలు)తోపాటు 14మంది గాయపడ్డారు. బస్సు ముందు భాగంలో కూర్చున్న రమేష్ సీట్లో ఇరుక్కొని అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు.
క్షతగాత్రులను అంబులెన్స్‌లలో నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్వల్ప గాయాలైన వారిని ప్రాథమిక చికిత్స అనంతరం వారి ప్రాంతాలకు పంపించారు. ఆరు నెలల మోక్షిత్æ తలకు బలమైన గాయాలయ్యాయి. ఇతని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విశాఖ తరలించారు. సంఘటన స్థలాన్ని నర్సీపట్నం ఏఎస్పీ అదిరాజ్‌సింగ్ రాణా, నక్కపల్లి సీఐ అప్పన్న పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి నుంచి వివరాలు సేకరించారు. మృతుడి భార్య కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పోలీసులు తెలిపారు.
క్షతగాత్రుల వివరాలివి..
గొర్ల బలరామం (దేవరపల్లి, బొబ్బిలి), ఎ.గణే‹Ùకుమార్ (పార్వతీపురం), ఎస్.వెంకటవరప్రసాద్ (బొబ్బిలి), చిలకంట నరేంద్ర (బెంగళూరు), చంద్ర (బెంగళూరు), అల్లు శాంతారాం (పార్వతీపురం), గొల్ల శిరీష (పార్వతీపురం), ముప్పాల వర్షిత (బొబ్బిలి), మున్నం దేముడమ్మ (పెందుర్తి), ఆకోటి ధరణి (సాలూరు) అల్లు సావత్రిమ్మ (పార్వతీపురం), పి.కోటేశ్వరమ్మ (పార్వతీపురం)
Comments
Please login to add a commentAdd a comment