
వెజిటేరియన్ పదార్ధాలతో తయారైన బాల గణపతి
కేపీహెచ్‌బీ డివిజన్ సాయి నగర్‌లో పినాకిల్ కాలేజ్ ఆఫ్ హøటల్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో ఫుడ్డీ గణపతి
బాలానగర్: పలు ఆహార పదార్థాలు బాల గణపతి రూపంలో ఒదిగాయి. కేపీహెచ్‌బీ డివిజన్ సాయి నగర్‌లో గల పినాకిల్ కాలేజ్ ఆఫ్ హøటల్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో ఆదివారం ఈ ఫుడ్డీ గణపతి రూపుదిద్దుకున్నాడు. ఫ్రూటీ, కొబ్బరికోరు, చెర్రీస్, షుగర్ బాల్స్ వంటి పదార్థాలను వినియోగించి ఎటువంటి ఎగ్ వాడకుండా, వంద శాతం వెజిటేరియన్ పదార్థాలతో 40 కేజీల ప్రతిమను తయారు చేశారు. 50 మంది విద్యార్థులు రెండు రోజుల పాటు కష్టపడి దీనిని తయారు చేశారని ప్రిన్సిపల్ వై. శ్రీదేవి, డైరెక్టర్ మధుసూదన్‌రావు తెలిపారు.