
బాలానగర్‌లో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్: నగరంలోని బాలానగర్ పారిశ్రామికవాడలో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక కృష్ణ ప్లాస్టిక్ కంపెనీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో.. భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మూడు ఫైరింజన్ల సాయంతో మంటలు ఆర్పుతున్నారు.