హైదరాబాద్ బాలానగర్లోని ఎంటీఆర్ కంపెనీలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కంపెనీ పూర్తిగా దగ్ధం అయ్యింది.
హైదరాబాద్ : హైదరాబాద్ బాలానగర్లోని ఎంటీఆర్ కంపెనీలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కంపెనీ పూర్తిగా దగ్ధం అయ్యింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో చుట్టుపక్కల భారీగా పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది.