హైదరాబాద్‌: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై లైంగిక దాడి | HYD Man Molested On Woman In the Name Of love And Marriage | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై లైంగిక దాడి

Published Fri, Feb 4 2022 8:13 PM | Last Updated on Fri, Feb 4 2022 9:29 PM

HYD Man Molested On Woman In the Name Of love And Marriage - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బాలనగర్‌: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిపై లైంగిక దాడిచేసిన ఓ యువకుడు కటకటాల పాలయ్యాడు. ఈ సంఘటన బాలనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ఎండి వాహుత్‌ దిన్‌ తెలిపిన మేరకు.. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అనిల్‌ కుమార్‌ అనే యువకుడు  బాలనగర్‌ లోని వినాయక్‌ నగర్‌ లో నివసిస్తున్నాడు. సొంతంగా వ్యాపారం నిర్వహించుకుంటున్నాడు.

ఈ క్రమంలో అదే కాలనీకి చెందిన ఓ యువతి అతనికి పరిచయం అయింది. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి ఆమెపై లైంగికదాడి చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసి దర్యాప్తు చేసిన పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.  
చదవండి: మహిళా ప్రొఫెసర్‌కు అ‍శ్లీల వీడియోలు, అసభ్యకర మెసేజ్‌లు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement