
రోడ్డుపై పరుగెత్తిన చిన్నారి, ఇన్‌సెట్‌లో బాలుడు విలియం కేర్
బాలానగర్ : తల్లి చేయి పట్టుకుని వెళుతున్న ఓ బాలుడు హఠాత్తుగా రోడ్డు దాటేందుకు యత్నించాడు..అదే సమయంలో వేగంగా దూసుకువచ్చిన ఓ బైక్ ఆ చిన్నారిని ఢీకొట్టింది. రెప్పపాటు కాలంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో చిన్నారి తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు..ఒక్కసారిగా రోడ్డుకు అడ్డంగా బాలుడు రావడంతో షాక్‌కు గురైన వాహనదారుడు సొమ్మసిల్లి పడిపోయాడు. వివరాల్లోకి వెళితే..బాలానగర్, వినాయక్‌నగర్ ప్రాంతంలో సాల్మాన్, కుమారి దంపతులు నివాసం ఉంటున్నారు.
శుక్రవారం క్రిస్మస్ నేపథ్యంలో కుమారి తన కుమారుడు విలియంకేర్‌తో కలిసి సమీపంలోని చర్చికి బయలుదేరింది. బీబీఆర్ ఆస్పత్రి వద్దకు రాగానే తల్లి చేయిపట్టుకుని నడుస్తున్న విలియంకేర్ ఒక్కసారిగా రోడ్డు అవతలి వైపునకు వెళ్లేందుకు పరుగెత్తాడు. అదే సమయంలో స్నేహితుడితో కలిసి బైక్‌పై బాలానగర్ వైపు వస్తున్న వివేక్ వర్మ అనే వ్యక్తి సడెన్‌గా రోడ్డు మధ్యలోకి వచ్చిన బాలుడిని ఢీకొనడంతో చిన్నారి కిందపడ్డాడు. గిలగిలా తన్నుకుంటున్న బాలుడిని స్థానికులు అక్కున చేర్చుకుని సపర్యలు చేశారు. ఈ ఘటనతో షాక్‌కు గురైన తల్లి కుమారి బోరున విలపించింది. అదృష్టవశాత్తూ బాలుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇదిలా ఉండగా ఈ ఘటనతో షాక్‌కు గురైన వాహనదారుడు వివేక్ వర్మ అక్కడే రోడ్డుపై కుప్పకూలిపోయాడు. తనతో వచ్చిన స్నేహితుడితో పాటు స్థానికులు అతనికి సైతం సపర్యలు చేయడంతో షాక్ నుంచి కోలుకుని తన గమ్యం వైపు సాగిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment