
సాక్షి, హైదరాబాద్: బాలానగర్ మెట్రోస్టేషన్ పేరు మార్పు చేస్తూ హైదరాబాద్ మెట్రో రైలు(హెచ్‌ఎంఆర్) గురువారం నిర్ణయం తీసుకుంది. దళితుల ఐక్య వేదిక, పలు ప్రజా సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు బాలానగర్ మెట్రోస్టేషన్ పేరును అంబేద్కర్ మెట్రోస్టేషన్‌గా మారుస్తూ హెచ్‌ఎంఆర్ మేనేజింగ్ డైరెక్టర్ శివానంద్ నింబార్గి ఉత్తర్వులు జారీ చేశారు.
అసలు బాలానగర్ ఉన్న ప్రాంతానికి, మెట్రో స్టేషన్ ప్రస్తుతం కట్టిన దానికి మూడున్నర కిలో మీటర్ల దూరం ఉంది. భవిష్యత్తులో మెట్రోను విస్తరించినపుడు అమోమయానికి గురికాకుండా ఉండేందుకు మెట్రో స్టేషన్ పేరును మారుస్తున్నట్లు హెచ్‌ఎంఆర్ తెలిపింది.