హైదరాబాద్: కూకట్‌పల్లి వైజంక్షన్‌లో ఉన్న బాలానగర్ మెట్రో స్టేషన్ పేరును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలానగర్ స్టేషన్‌గా శనివారం నామకరణం చేశారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులు కలసి పేరును అధికారికంగా మార్చారు.
ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన సభపై మెట్రో ఎండీ ఎన్వీఎస్.రెడ్డి స్టేషన్ పేరు మారుస్తున్నట్లుగా ఉన్న పత్రాలను కలెక్టర్, కమిషన్ చైర్మన్, ఎంపీ, ఎమ్మెల్యేలకు అందజేశారు. అనంతరం ఎన్‌వీఎస్.రెడ్డి మాట్లాడుతూ, అంబేడ్కర్ మహామేధావి అని, ఆయన పేరు మెట్రో స్టేషన్‌కు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఎల్ అండ్ టీని ఒప్పించి పేరు మార్చామని చెప్పారు. దళిత ఐక్యవేదిక నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పేరు మార్పునకు ఎంతో కృషి చేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment