బాలానగర్‌లో కార్డెన్‌ సర్చ్‌ | Carden Search in Balanagar | Sakshi

బాలానగర్‌లో కార్డెన్‌ సర్చ్‌

Published Thu, Jun 7 2018 1:12 PM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM

Carden Search in Balanagar - Sakshi

స్థానికులకు సూచనలిస్తున్న ఎస్పీ అనురాధ

బాలానగర్‌ (జడ్చర్ల): మండల కేంద్రంలో బుధవారం రాత్రి ఎస్పీ అనురాధ ఆధ్వర్యంలో ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ భాస్కర్, సీఐలు, ఎస్‌ఐలు, 90 మంది ప్రత్యేక బలగాలతో కార్డెన్‌ సర్చ్‌ నిర్వహించారు. ముందుగా వీధుల్లో తిరిగి కాలనీవాసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి వ్యక్తికి సంబంధించిన ఆధార్‌కార్డు, ఇతర గుర్తింపు కార్డులను పరిశీలించారు. అనుమానస్పదంగా ఉన్న 7 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. అంతేకాకుండా 21 ద్విచక్రవాహనాలను అదుపులోకి తీసుకున్నారు  

గ్రామస్తులతో ముఖాముఖి 

గ్రామ ముఖ్య కూడలిలో గ్రామ ప్రజలతో ఎస్పీ ముఖాముఖి నిర్వహించారు. గ్రామంలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నా.. కొత్తవారు కనిపించినా వెంటనే 100 నెంబరుకుగాని, పోలీసులకు గాని సమాచారం అందించాలని సూచించారు. గుర్తు తెలియని వక్తులకు ఇళ్లు అద్దెకు ఇచ్చేటప్పుడు ఆధార్‌ కార్డు  చూసి ఇవ్వాలని సలహాఇచ్చారు. సోషల్‌ మీడియాలో వచ్చే వదంతులను నమ్మరాదని, బిహార్‌ ముఠాలు తిరుగుతున్నా యని చెప్పడం అంతా కల్పితాలే కొట్టిపారేశారు.

ఫ్రెండ్లీ పోలిసింగ్‌లో ఏవైనా లోపాలుంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్డెన్‌ సర్చ్‌లో జడ్చర్ల రూరల్‌ సీఐ రవిందర్‌ రెడ్డి, సీఐలు బాల్‌ రాజ్, సంపత్, బాలానగర్‌ ఎస్‌ఐ శ్రీనివాస్, రాజా పూర్‌ నర్సయ్య, మక్తల్‌ ఎస్‌ఐ అశోక్, నావాబ్‌పేట్‌ ఎస్‌ఐ ప్రవీణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. కాలనీల్లో అనుమాని యువకులను విచారిస్తున్న ఎస్సీ అనురాధ, అధికారులు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement