Bandra-Kurla Complex
-
దారుణం: వేశ్యను వాడుకుని డ్రైనేజీలో పారవేత
ముంబై: మహిళపై అత్యారానికి పాల్పడి అనంతరం దారుణంగా హత్య చేశారు. అంతటితో వదలకుండా ఆమె మృతదేహాన్ని ఏకంగా భూగర్భ డ్రైనేజీ సమీపంలో పారవేసిన సంఘటన మహారాష్ట్రలో కలకలం రేపుతోంది. మహారాష్ట్రలో సంపన్నులు నివసించే బాంద్రాలో ఈ ఘటన చోటుచేసుకుంది. చౌరస్తా మధ్యలో ఉన్న డ్రైనేజీ వద్ద కొందరు మహిళ శవాన్ని గుర్తించారు. ముంబైలోని ఎంటీఎన్ఎల్ జంక్షన్ సమీపంలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ వద్ద ఉన్న డ్రైనేజీ వద్ద స్థానికులు ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించగా మహిళ అత్యాచారంతో పాటు హత్యకు గురయ్యిందంటూ వైద్యులు నిర్ధారించారు. జననాంగాల వద్ద తీవ్రంగా గాయాలైనట్టు వైద్యులు తమ నివేదికలో తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు సెక్షన్ 376 (అత్యాచారం), 302 (హత్య) కింద కేసు నమోదు చేశారు. హత్యకు గురయిన ఆమె వేశ్య అని తెలిసింది. నగదు సంబంధించిన విషయంలో గొడవ జరిగి హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. ఆమెను పిలిపించుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని తెలుస్తోంది. అయితే ఇది క్షణికావేశంలో చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. చదవండి: మృగాళ్లకు బాలిక బలి: నిందితుల్లో మైనర్లు చదవండి: కరోనా భయంతో వర్ధమాన గాయని ఆత్మహత్య -
ప్రజా ఉద్యమానికి దిగిరావాల్సిందే!
సాక్షి, ముంబై : ఆదివాసీలు, విద్యార్థినీ విద్యార్థులు, టీచర్లు, అధ్యాపకులు, వివిధ వర్గాలకు చెందిన మధ్య తరగతికి చెందిన ప్రజలు దాదాపు వెయ్యి మంది తమ విధులను, పనులను ఎగ్గొట్టి జూలై ఎనిమిదవ తేదీన రోడెక్కారు. దొరికిన బస్సు, మెట్రో, రైలు పట్టుకొని బండ్రా–కుర్లా కాంప్లెక్స్‌లోని ఆడిటోరియంకు చేరుకున్నారు. ‘మెట్రో–3’ ప్రాజెక్ట్ కోసం కార్ షెడ్డును నిర్మించడం కోసం ముంబై ఆరే కాలనీలోని 2,702 చెట్లను నరికేయాలన్న మున్సిపల్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తమ గొంతును వినిపించేందుకు వారంతా అక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే ముంబై నగరం పర్యావరణ పరిస్థితులు దెబ్బతిన్న నేపథ్యంలో పచ్చటి చెట్లను నరికి వేయడానికి మీకెలా చేతులు వస్తాయంటూ ప్లే కార్డులు పట్టుకొని వారు నినాదాలు చేశారు. అరపులు, కేకలలతో గోల చేస్తూ హంగామా సృష్టించారు. అసలు ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఈ వేదికను ఏర్పాటు చేసిందే ‘బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్’. చెట్ల నరకివేతనకు వ్యతిరేకంగా దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మేరకు ముంబై హైకోర్టు నేరుగా ప్రజల వాణిని తెలుసుకునేందుకు ఈ వేదికను ఏర్పాటు చేయాల్సిందిగా మున్పిపాలిటీకి సూచించింది. ఏడాది క్రితమే ఏడాది క్రితమే ఈ ప్రజాభిప్రాయ సేకరణ జరగాల్సి ఉండింది. అప్పుడు ఆడిటోరియంలోకి ప్రవేశించేందుకు ప్రజలకు అనుమతివ్వకుండా పోలీసులు అడ్డుకోవడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో నాటి కార్యక్రమం వాయిదా పడింది. నాటి నుంచి ప్రజలు అవిశ్రాంతంగా పోరాటం కొనసాగిస్తుండడంతో రెండోసారి ఇప్పుడు తగిన ముందస్తు చర్యలతో ప్రజావాణి వినే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆరే కాలనీ చెట్లను కొట్టివేయడాన్ని ఆన్లైన్లో 82 వేల మంది వ్యతిరేకించారని మున్సిపల్ కార్పొరేషన్ స్వయంగా అంగీకకరించింది. అయితే వ్యతిరేకిస్తూ సంతకాలు చేసిన వారి సంఖ్య 1,93,865 మందైతే రెండు లక్షల మందికిపైగా వ్యతిరేకిస్తున్నారని సామాజిక కార్యకర్తలు తెలియజేస్తున్నారు. ఈ చెట్ల పరిరక్షణ కోసం మొట్టమొదట ప్రజాహిత వ్యాజ్యాన్ని, వ్యాపారవేత్త, చెట్ల పరిరక్షణ కార్యకర్త జోరు బతేనా దాఖలు చేశారు. అది కాస్త కాలక్రమంలో ప్రజా ఉద్యమంగా మారింది. ఈ ప్రజా ఉద్యమం ఊపిరి పోసుకుంది ఐదేళ్ల క్రితమే. 1886 ఎకరాల ఆరే అటవి ప్రాంతానికి రియల్ ఎస్టేట్ వ్యాపారుల ద్వారా ముప్పు ఏర్పడింది. 1949లో ఈ అటవి ప్రాంతంలో 3,162 ఎకరాల భూమి కాలక్రమంలో తరుగుతూ వచ్చింది. 1977లో రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్ర రిజర్వ్ పోలీసు ఫోర్స్‌కు 108 ఎకరాలు, 1989లో ఫిల్మ్ సిటీకి 329 ఎకరాలు, 2009లో కమాండో ఫోర్స్‌కు 98 ఎకరాలు, కొంకన్ అగ్రికల్చర్ యూనివర్శిటీ 145 ఎకరాలు కేటాయించింది. ఇటీవలి కాలంలో నగరంలో జూకు 100 ఎకరాలు కేటాయించారు. నాడు పలుచగా మొదలైన ప్రజా ఉద్యమం నేడు ఊపందుకుంది. నాటి ఉద్యమాన్ని లెక్కచేయని ప్రభుత్వం నేడు పట్టించుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఏ నాటికైనా, ఏ ప్రభుత్వంమైన ప్రజా ఉద్యమాలకు తలొంచాల్సిందే. -
తెలుగమ్మాయి నిజాయితీ...!
సాక్షి, ముంబై: ఖరీదైన మొబైల్ దొరికిందని తీసుకెళ్లకుండా తిరిగి ఇచ్చిన తెలుగమ్మాయిని పోలీసులు అభినందించారు. వివరాల్లోకెళితే.. మాటుంగాలో నివాసం ఉన్న మానవ హక్కుల సంఘం సభ్యుడు సురేశ్‌కుమార్ కూతురు విశాల గురువారం మాహిలో కాలిబాటన వెళుతుండగా రూ.40 వేలు విలువ చేసే ఫోన్ దొరికింది. అందులో ఉన్న నంబరు ఆధారంగా యజమాని అశీశ్కు ఫోన్ చేసి, స్థానిక బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫోన్ తీసుకెళ్లాలని తెలిపింది. ఫోన్ తీసుకున్న ఆశీశ్... ఆమె నిజాయితీకి మెచ్చి రూ.500 బహుమతిగా ఇచ్చాడు. ఆ నగదును విశాల స్వీకరించలేదు. ఆమె సంస్కారాన్ని, నిజాయితీని చూసి పోలీసులు అభినందించారు. -
‘మెట్రో’లో ఉద్యోగం అంటూ మోసం
సాక్షి, ముంబై: మెట్రో సంస్థలో ఉద్యోగుల భర్తీ ప్రక్రియ నకిలీ ప్రకటన, వెబ్‌సైట్‌పై బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ముంబై ప్రాంతీయ అభివృద్థి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) పరిపాలన విభాగం అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు ఇన్స్పెక్టర్ కుండలిక్ నిగడే చెప్పారు. ఈ బోగస్ వెబ్సైట్, ప్రకటనవల్ల అనేక మంది అమాయక నిరుద్యోగులు మోసపోయారు. లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నారు. దీంతో పోలీసులు ఈ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్నారు. కుండలిక్ నిగడే అందించిన వివరాల ప్రకారం... త్వరలో పనులు ప్రారంభమయ్యే మెట్రో-3 రైలు ప్రాజెక్టు కోసం ఆఫీసర్స్, క్లర్క్‌లు, ఇతర సాంకేతిక సిబ్బంది భర్తీ ప్రక్రియ ముంబై మెట్రో రైలు కార్పొరేషన్ ప్రారంభించింది. దీన్ని అవకాశంగా తీసుకుని ఓ ముఠా ఓ మరాఠీ దినపత్రిక నాగపూర్ ఎడిషన్‌లో నకిలీ ప్రకటన ఇచ్చింది. అందులో అభ్యర్థులు సంప్రదించేందుకు ఓ ల్యాండ్ లైన్ ఫోన్ నంబర్ కూడా ఇచ్చింది. ఇంతటితో ఊరుకోకుండా నకిలీ వెబ్సైట్ కూడా తెరిచారు. అందులో అమాయకులను ఆకట్టుకునేందుకు ఈ ఏడాది మేలో ముఖ్యమంత్రి వర్సోవాలో మెట్రో రైలు ప్రారంభించినప్పటి ఫొటోలు పెట్టారు. అమాయకులు నమ్మడానికి ఎంపికైన కొందరు అభ్యర్థుల పేర్లను అందులో పొందుపరిచారు. దీంతో నిరుద్యోగుల్లో మరింత ఆసక్తి పెరిగింది. అనేక మంది నిరుద్యోగులు ఆ ప్రకటనను నమ్మి ముఠా సభ్యులు సూచించిన ప్రకారం బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేశారు. ఉద్యోగం వస్తుందని గంపెడాశతో ఉన్నారు. కాని ఎవరూ దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. ఈ బండారం బయటపడిందిలా... ఎమ్మెమ్మార్డీయేలో పనిచేస్తున్న ఓ సిబ్బంది కూతురు ఈ ప్రకటన, వెబ్సైట్ చూసి ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంది. తరువాత బ్యాంక్‌లో రూ.13,500 డిపాజిట్ చేయాలని ముఠా సభ్యులు ఫోన్‌చేసి చెప్పారు. కాని ఉద్యోగ భర్తీ ప్రక్రియలో ఇలా డబ్బులు డిపాజిట్ చేయరని తెలియడంతో ఈ ముఠా బండారం బయట పడింది. పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ఆ ల్యాండ్ లైన్ నంబర్ ఢిల్లీకి చెందినదని తెలిపారు. దీనిపై అజ్ఞాత వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నకిలీ వెబ్‌సైట్‌ను మూసివేసేందుకు సైబర్ శాఖ అధికారుల సాయం తీసుకుంటున్నట్లు నిగడే తెలిపారు. ఇలాంటి నకిలీ ప్రకటనలకు బలికావద్దని ఎమ్మెమ్మార్డీయే అధికారులు సూచించారు. -
కాగితాల నుంచి నిర్మాణానికి..
సాక్షి, ముంబై : తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే ముంబైకర్లకు శుభవార్త. కొద్ది సంవత్సరాలుగా కాగితాలకే పరిమితమైన బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)-చునాబట్టి ప్రాంతాలను కలిపే ఫ్లై ఓవర్ ప్రతిపాదనకు త్వరలో మోక్షం లభించనుంది. ముంబైలో ప్రభుత్వ, ప్రైవేటు కార్పొరేట్ కార్యాలయాలకు బీకేసీ ప్రధాన నిలయంగా మారింది. ఈ ప్రాంతం అతి తక్కువ సమయంలోనే ప్రసిద్ధి గాంచింది. ఇక్కడికి నిత్యం ఉద్యోగులు, వివిధ పనుల నిమిత్తం వచ్చే వారి సంఖ్య దాదాపు లక్షాపైనే ఉంటుంది. వీరి సౌకర్యార్థం బీకేసీ నుంచి చునాబట్టి వరకు పశ్చిమ-తూర్పు ప్రాంతాలను కలిపేందుకు 1.6 కి.మీ. ఫ్లై ఓవర్ నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆ మేరకు ముందుగా రూపొందించిన ప్రణాళిక ప్రకారం మిఠీనది పరిసరాల్లో కేబుల్ సపోర్టుతో ఫ్లై ఓవర్ నిర్మించాల్సి ఉంది. అందుకు మొత్తం రూ.261 కోట్లు ఖర్చవుతాయని అంచనవేశారు. ఈ ప్రతిపాదన ఫైలు కొద్ది సంవత్సరాలుగా పడకేసింది. కానీ, మిఠీనది మధ్య భాగంలో ఒక పిల్లర్ వేసేందుకు కేంద్ర పర్యావరణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పడకేసిన ఈ ఫైలు మళ్లీ తెరమీదకు వచ్చింది. ఈ పిల్లర్ కారణంగా ఈ ప్రాజెక్టుకయ్యే వ్యయం రూ.58 కోట్ల మేర తగ్గింది. మొత్తం రూ.203 కోట్లతో ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తామని ముంబై ప్రాంతీయ అభివృద్థి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ఆరు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయని ఎమ్మెమ్మార్డీయే అధికార వర్గాలు తెలిపాయి. మరో పదిహేను రోజుల్లో ఎమ్మెమ్మార్డీయే పూర్తిగా అధ్యయనం చేయనుంది. ఆ తర్వాత వర్క్ ఆర్డర్ జారీ చేయనుంది. ఫ్లై ఓవర్ రూట్.... ఈ ఫ్లై ఓవర్ బీకేసీలోని జి-బ్లాక్ (డైమాండ్ బోర్స్ వెనక) నుంచి మహారాష్ట్ర నేచర్ పార్క్, ఎల్బీఎస్ రోడ్, సెంట్రల్ రైల్వే ట్రాక్ మీదుగా, సోమయ్య మైదానం సమీపంలో నుండి చునాబట్టి వరకు వెళుతుంది. అందుకు సెంట్రల్ రైల్వే పరిపాలన విభాగం కూడా ప్రాథమికంగా అనుమతి ఇచ్చింది. టెండరు వేసిన ఐదు కంపెనీలు ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ఏడు కంపెనీలు సిద్ధంగా ఉన్నప్పటికీ ఐదు కంపెనీలు మాత్రమే టెండర్లు వేశాయి. ఇందులో గ్యామన్ ఇండియా, సింప్లెక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జే.కుమార్, ఎల్ అండ్ టీ, జేఎంసీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఎస్‌సీఎల్‌ఆర్ వల్ల తగ్గిన ట్రాఫిక్ శాంతకృజ్-చెంబూర్ లింక్ రోడ్డు (ఎస్‌సీఎల్‌ఆర్) ప్రారంభం కావడంతో సైన్-ధారావి లింకు రోడ్డు, కలానగర్‌లో ట్రాఫిక్ జాం సమస్య కొంత తగ్గింది. బీకేసీ-చునాబట్లి ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ జాం సమస్య పూర్తిగా తగ్గనుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, పారిశ్రామిక వేత్తల విలువైన సమయం, ఇందనం ఎంతో ఆదా కానుంది.