స్వాతి చిత్రపటం వద్ద కొవ్వొత్తులు వెలిగిస్తున్న విద్యార్థులు
యూనికీ క్యాసెక్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
పుణే సిటీ: మురుడ్ తీరం వద్ద సముద్రంలో మునిగి వృతిచెందిన తెలుగమ్మాయి స్వాతి ఆత్మకు శాంతి చేకూరాలని యూనికీ క్లాసెక్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎల్లో బ్లోసం సొసైటీ నుంచి శనివారం సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమైన ర్యాలీ రామ్‌నగర్ వరకు సాగింది. దాదాపు 300 మంది విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు.
స్వాతి తల్లి హైమావతి, యూనికీ క్లాసెస్ వ్యవస్థాపకుడు మన్సూర్ అలీ ఖాన్, పుణే పట్టణ నేషనల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రవి దాండేలి, సాధన సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ చంద్రకాంత్ కవడే, ముండువ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ జేఎస్ పఠాన్, కమతం హరిబాబు, కమతం మల్యాద్రి తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు.
వైఎస్సార్ జిల్లా చెన్నూరుకు చెందిన రమణయ్య, హైమావతి దంపతులకు స్వాతి రెండవ సంతానం. 35 ఏళ్లుగా పుణేలో నివాసం ఉంటున్నారు. తండ్రి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో ఉద్యోగి. గతేడాది అనారోగ్యంతో తండ్రి రమణయ్య మరణించారు. ఇనాందార్ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్వాతి సాయంత్రం యూనిక్ క్లాసెస్‌లో విద్యార్థులకు ట్యూషన్ చెబుతూ వచ్చే వేతనంతో అమ్మకు చేదోడువాదోడుగా నిలిచేది. స్వాతి మరణంతో వారి కుటుంబం శోక సంద్రంలో మునిగింది.