Murud beach
-
పారా సెయిలింగ్ చేస్తుండగా తాడు తెగి..
సాక్షి ముంబై : ముంబైలోని మురూడ్‌లో పారా సెయిలింగ్ చేస్తుండగా తాడు తెగి ఓ 15 ఏళ్ల బాలుడు మరణించాడు. మరోవైపు ఆ బాలుని తండ్రికి గాయాలయ్యాయి. మురూడ్ సముద్ర తీరంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పుణే కసబారోడ్డుపై నివసించే గణేష్ పవార్ కుటుంబీకులు అలీబాగ్‌కు విహారయాత్రకు వెళ్లారు. సమీపంలో మురూడ్ తీరంలో పారా సేలింగ్ చేసేందుకు సిద్దమయ్యారు. పారాచూట్ పైకి వెళ్లిన అనంతరం దాని తాడు తెగిపోవడంతో ఒక్కసారిగా గణేష్ పవార్‌తోపాటు ఆయన కుమారుడు వేదాంత్ పవార్ (15) ఇద్దరు చాలా ఎత్తు నుంచి కిందపడిపోయారు. దీంతో ఘటన స్థలంలోనే వేదాంత్ దుర్మరణం చెందాడు. మరోవైపు గణేష్ పవార్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. -
స్వాతికి అశ్రు నివాళి
యూనికీ క్యాసెక్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ పుణే సిటీ: మురుడ్ తీరం వద్ద సముద్రంలో మునిగి వృతిచెందిన తెలుగమ్మాయి స్వాతి ఆత్మకు శాంతి చేకూరాలని యూనికీ క్లాసెక్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎల్లో బ్లోసం సొసైటీ నుంచి శనివారం సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమైన ర్యాలీ రామ్‌నగర్ వరకు సాగింది. దాదాపు 300 మంది విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. స్వాతి తల్లి హైమావతి, యూనికీ క్లాసెస్ వ్యవస్థాపకుడు మన్సూర్ అలీ ఖాన్, పుణే పట్టణ నేషనల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రవి దాండేలి, సాధన సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ చంద్రకాంత్ కవడే, ముండువ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ జేఎస్ పఠాన్, కమతం హరిబాబు, కమతం మల్యాద్రి తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లా చెన్నూరుకు చెందిన రమణయ్య, హైమావతి దంపతులకు స్వాతి రెండవ సంతానం. 35 ఏళ్లుగా పుణేలో నివాసం ఉంటున్నారు. తండ్రి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో ఉద్యోగి. గతేడాది అనారోగ్యంతో తండ్రి రమణయ్య మరణించారు. ఇనాందార్ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్వాతి సాయంత్రం యూనిక్ క్లాసెస్‌లో విద్యార్థులకు ట్యూషన్ చెబుతూ వచ్చే వేతనంతో అమ్మకు చేదోడువాదోడుగా నిలిచేది. స్వాతి మరణంతో వారి కుటుంబం శోక సంద్రంలో మునిగింది. -
ప్రాణాలు తీసిన ఫొటోలు
ముంబై: మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లాలోని మురూద్-జంజీరా తీరంలో సోమవారం సముద్రంలో మునిగి 14 విద్యార్థులు మృతి చెందిన విషాదకర ఘటనకు ఫొటోలు, సెల్ఫీ కారణమని తెలుస్తోంది. తమ స్నేహితులు ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటుండగా ఒక్కసారిగా కెరటాలు ఎగసిపడడంతో కొట్టుకుపోయారని ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన విద్యార్థిని తెలిపింది. పెద్ద కెరటాలు సముద్రం లోపలికి లాక్కుపోయిందని చెప్పింది. వీరిని రక్షించేందుకు పలువురు సముద్రంలోకి దూకారని తెలిపింది. వాహనాలు అందుబాటులో లేకవడంతో ఎడ్ల బండ్లు, గుర్రపు బళ్లలో బాధితులను ఆస్పత్రికి తరలించారని వెల్లడించింది. దేవుడి దయతో తాను, తన స్నేహితులు ప్రాణాలతో బయటపడ్డామని చెప్పింది. తనను బతికించినందుకు దేవుడిని ధన్యవాదాలు తెలిపింది. పుణేలోని ఇనాందార్ కాలేజీలో బీఎస్సీ, బీసీఏ చదువుతున్న 116 మంది విద్యార్థులు మురూడ్-జంజీరాకు మూడు బస్సుల్లో వచ్చారు. వీరిలో కొందరు.. ఉపాధ్యాయులకు తెలియకుండా మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఈత కోసం సముద్రంలోకి దిగారు. అదే సమయంలో భారీ అలలు రావడంతో నీట మునిగి కొట్టుకుపోయారు. దీంతో 14 మంది విద్యార్థులు మృతి చెందారు.