సాక్షి, విజయవాడ : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఈనెల 31 వరకు ఎలాంటి తరగతులు నిర్వహించరాదని ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ రామకృష్ణ వెల్లడించారు. ఏపీ ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఇంటర్మీడియట్ బోర్డు సూచనలను ఉల్లంఘిస్తే కళాశాల మేనేజ్‌మెంట్, ప్రిన్సిపాల్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా వ్యాధి నేపథ్యంలో ఈ నెల 21 నుంచి జరగాల్సిన ఇంటర్మీడియట్ వాల్యూషన్ తేదీల్లో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. వాటిని ఈ నెల 31 తర్వాత ఇంటర్ బోర్డు వెల్లడించనున్నట్లు తెలిపారు. అదే విధంగా ఏలూరులో కరోనా హెచ్చరికలను ఖాతరు చేస్తూ పాఠశాల నిర్వహించిన నారాయణ, భారతి విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. యజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులు పాఠశాలలను సీజ్ చేశారు. (కనికా నిర్లక్ష్యంతో పార్లమెంటులో కలకలం)
విజయవాడ: జిల్లాలో కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకొన్నామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. పదిహేను రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామన్నారు. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు 900 మంది విదేశాల నుంచి వచ్చారని, వాళ్లందరినీ హౌస్ ఐసోలేషన్‌లో ఉంచామని తెలిపారు. ఇప్పటి వరకు తీసిన మూడు శాంపిల్స్ నెగిటివ్ వచ్చాయని, ఈ రోజు(శుక్రవారం) మరో శాంపిల్ టెస్టింగ్ కోసం పంపామని అన్నారు. యాభై ఆసుపత్రిలో 200 పడకలు ఏర్పాటు చేశామని, థర్మల్ స్క్రీనింగ్ చేశాకే ఎయిర్ పోర్టు నుంచి అనుమతిస్తున్నామని తెలిపారు. నిన్న(గురువారం) ఫిలిప్పీన్స్ నుంచి వచ్చిన 18 మంది మెడికల్ విద్యార్థులను హౌస్ ఐసోలేషన్ లొ పెట్టామని, రాష్ట్రంలో కరోనా ప్రభావం భయపడే స్థాయిలో లేకపోయినా.. జాగ్రత్తగా ఉండాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. జనంలో కరోనాపై అపోహలు పోగొట్టి అవగాహన పెంచాలని సీఎం సూచించారన్నారు.(కామసూత్ర నటికి కరోనా పాజిటివ్)
Comments
Please login to add a commentAdd a comment