Inter classes
-
ఎక్కడికక్కడే సమస్యలు నేటి నుంచి ఇంటర్ క్లాసులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ క్లాసులు శనివారం నుంచి అధికారికంగా ప్రారంభం కానున్నాయి. అందుకు అవసరమైన ఏర్పాట్లు ఇంటర్ అధికారులు చేశారు. ప్రస్తుతం వడగాడ్పులు వీస్తున్న నేపథ్యంలో మొదటివారం రోజులూ ప్రభుత్వ, గురుకుల కాలేజీలతోపాటు కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో హాజరుశాతంపై అధికారులు పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. జూన్ రెండోవారం వరకూ విద్యార్థులు పెద్దగా కాలేజీలకు రాకపోవచ్చని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కూడా జూన్ 1 నుంచే మొదలవ్వాలి. ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ ఇప్పుడిప్పుడే మొదలైంది. ఈ కారణంగా ఫస్టియర్ విద్యార్థులకు జూన్ ఆఖరు వరకూ క్లాసులు జరిగే అవకాశం లేదు. అయితే, ప్రైవేట్ కాలేజీల్లో ఇప్పటికే దాదాపు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించకపోయినా, చాలాచోట్ల అనధికారికంగానే క్లాసులు నడుస్తున్నాయనే వార్తలొస్తున్నాయి. రెండో సంవత్సరం క్లాసులు కూడా ఇప్పటికే ప్రారంభించారు. 600 కాలేజీలకు పూర్తికాని అఫ్లియేషన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలు 3 వేలకుపైగానే ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ కాలేజీలు 422 వరకూ ఉన్నాయి. గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు తీసేస్తే 1400 కాలేజీలు ప్రైవేట్ రంగంలోనే ఉన్నాయి. వీటన్నింటికీ ఇంటర్‌బోర్డు అనుబంధ గుర్తింపు ఇవ్వాలి. కాలేజీల్లో ఫ్యాకల్టీ, మౌలిక వసతులు, పరిసరాలను జిల్లా అధికారులు తనిఖీ చేసిన తర్వాత ఈ గుర్తింపు ఇస్తారు. అయితే సరైన డాక్యుమెంట్లు సమరి్పంచని కారణంగా ఇంకా 600 ప్రైవేట్ కాలేజీలకు గుర్తింపు రాలేదు.అయినా ఆ కాలేజీలు అడ్మిషన్లు కొనసాగించినట్టు తెలుస్తోంది. ఒక్కో కాలేజీ రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేశాయి. వేల సంఖ్యలో విద్యార్థులను చేర్చుకున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 72వేల మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులుంటే, ప్రైవేటు కాలేజీల్లో 2.35 లక్షల మంది ఉన్నారు. ఆఖరిదశ వరకూ అప్లియేషన్ల ప్రక్రియ కొనసాగించడం వల్ల ప్రతీ సంవత్సరం విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు.ప్రభుత్వ కాలేజీల్లో సమస్యలెన్నో... ⇒ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,654 లెక్చరర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ⇒ 225 ఒకేషనల్ అధ్యాపకుల పోస్టులూ ఖాళీనే.ళీ 26 కాలేజీల్లో కీలకమైన సబ్జెక్టులు బోధించే అధ్యాపకుల కొరత వేధిస్తోంది. ⇒394 కాలేజీలకు పక్కా భవనాలున్నా, నిర్వహణకు అవసరమైన నిధులు మంజూరు కావడం లేదు. ⇒ కొత్తగా 26 జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేసినా, అవసరమైన అధ్యాపకులను ఇవ్వలేదు. మౌలిక వసతులూ కలి్పంచలేదు. ⇒సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌పై ఇంతవరకూ ఎక్కడా నిధులు ఇవ్వలేదని అధ్యాపక సంఘాలు అంటున్నాయి. ⇒ అదనపు గదులు లేకపోవడంతో కొన్ని గ్రూపులను కలిపి బోధించే పరిస్థితి ఉంది. ⇒ఇప్పటి వరకూ ఎక్కడా పాఠ్యపుస్తకాల పంపిణీ జరగలేదు. ఇంటర్ విద్యపై దృష్టి పెట్టాలి పేద విద్యార్థులు చేరే ప్రభుత్వ ఇంటర్ కాలేజీలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలి. త్వరగా పాఠ్యపుస్తకాలు అందితే బోధన అనుకున్న ప్రకారం జరుగుతుంది. ప్రైవేటు తో దీటుగా ఫలితాలు వస్తాయి. కాలేజీల్లో తాగునీటి సౌకర్యం, ఫరి్నచర్, సరిపడా గదులు ఏర్పాటు చేయాలి. – మాచర్ల రామకృష్ణగౌడ్, తెలంగాణ ఇంటర్మిడియట్ ప్రభుత్వ లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిఅన్ని సమస్యలూ పరిష్కరిస్తాం జూనియర్ కాలేజీల్లో ఎలాంటి సమస్యలూ లేకుండా నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. కాలేజీల అఫ్లియేషన్‌కు ఇంకా సమ యం ఉంది. అన్ని డాక్యుమెంట్లు సమరి్పస్తే కచి్చతంగా గుర్తింపు ఇస్తాం. మౌలిక వసతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పాఠ్య పుస్తకాల ముద్రణ కొనసాగుతోంది. త్వరలో అందించే ప్రయత్నం చేస్తాం. – శ్రుతి ఓజా, ఇంటర్‌బోర్డు కార్యదర్శి -
ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. అడ్మిషన్ల షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల్లోని జూనియర్ కాలేజీల్లో 2022–23 విద్యా సంవత్సరం అడ్మిషన్ల షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ బోర్డు శనివారం ప్రకటించింది. జూన్ 20 నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం దరఖాస్తుల విక్రయం ప్రారంభించాలని పేర్కొంది. జూలై 1 నుంచి తరగతులు చేపట్టాలని సూచించింది. ఇంటర్ మొదటి దశ అడ్మిషన్ల షెడ్యూల్.. దరఖాస్తుల విక్రయం: జూన్ 20 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూలై 20 అడ్మిషన్లు ప్రారంభం: జూన్ 27 అడ్మిషన్లు పూర్తయ్యేది: జూలై 20 ఫస్టియర్ తరగతులు ప్రారంభం: జూలై 1 చదవండి: ఇదేం దిగజారుడు.. ట్విట్టర్లో ఆ పోస్టులేంటి అయ్యన్న.. -
జూలై 1 నుంచి ఇంటర్ తరగతులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలు జూలై 1వ తేదీనుంచి ప్రారంభం కానున్నాయి. 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్మీడియట్ బోర్డు సోమవారం విడుదల చేసింది. మొత్తం 295 రోజులకు సంబంధించి 220 పనిదినాలు ఉండగా 75 రోజులు సెలవు దినాలుగా పేర్కొంది. 2023 ఏప్రిల్ 21వ తేదీతో విద్యాసంవత్సరం ముగియనుంది. ఆ మరుసటి రోజు నుంచి మే 31వ తేదీ వరకు కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించనున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ మేరకు మాత్రమే ఆయా కాలేజీలు అడ్మిషన్లు నిర్వహించాలని బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు స్పష్టం చేశారు. అడ్మిషన్ల కోసం ప్రకటనలు ఇతర రకాల చర్యలతో విద్యార్థులను ఆకర్షించడం వంటి కార్యక్రమాలు చేయరాదని పేర్కొన్నారు. -
మళ్లీ ఆన్లైన్!
సాక్షి, హైదరాబాద్: విద్యాసంస్థలు మళ్లీ ఆన్లైన్ బాటపట్టాయి. కరోనా ఉధృతి దృష్ట్యా సెలవుల పొడిగింపుతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇంజనీరింగ్ సహా ఉన్నత విద్య విభాగాలు ఇప్పటికే ఆన్లైన్ బోధనపై కాలేజీలకు ఆదేశాలు జారీ చేశాయి. ఇంటర్ బోర్డ్ టీ–శాట్ ద్వారా బోధనకు షెడ్యూల్ ఇచ్చింది. పాఠశాల విద్యపై ఇప్పటివరకూ స్పష్టత రాలేదు. ఉన్నతాధికారులు సోమవారం దీనిపై సమాలోచనలు జరపనున్నారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను పరిగణనలోకి తీసుకుని ఆన్లైన్ వైపు అడుగు లేయక తప్పదని పాఠశాల విద్య ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అన్ని ప్రైవేటు కాలేజీల అధ్యా పకులు అందుబాటులోకి రావాలని ఆదివారం కబురుపెట్టాయి. ఆన్లైన్ తరగతులకు సిద్ధంగా ఉండాలని విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రైవేటు యాజమాన్యాలు సందేశాలు పంపాయి. సెలవులు ఈనెల 30 వరకు ప్రకటించినందున ఆ తర్వాతైనా విద్యా సంస్థలు ప్రత్యక్ష బోధనకు వెళ్తాయా? అనే సందేహాలు ఉన్నాయి. రెండేళ్లుగా అరకొర బోధనే.. కరోనా కారణంగా రెండేళ్లుగా విద్యారంగం సవాళ్లను ఎదుర్కొంటోంది. 2020 మార్చిలో లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ఆన్లైన్ బోధనే అనివార్యమైంది. 2021లో ఫిబ్రవరిలో ప్రత్యక్ష బోధన మొదలైనా కోవిడ్ తీవ్రత పెరగడంతో మార్చి 21 నుంచి విద్యాసంస్థలు మళ్లీ మూతపడ్డాయి. దీంతో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించకుండా అందరినీ ప్రమోట్ చేశారు. ఇంజనీరింగ్ ఫైనల్ విద్యార్థులకు అందుబాటులో ఉన్న కేంద్రాల్లోనే పరీక్షల తంతు ముగించారు. దీంతో ఈ విద్యాసంవత్సరం పూర్తిగా దెబ్బతింది. 2021 జూలై నుంచి ఆన్లైన్ ద్వారానే బోధన చేపట్టారు. కరోనా తీవ్రత తగ్గడంతో పూర్తిస్థాయి ప్రత్యక్ష బోధన అక్టోబర్ నుంచి మొదలైంది. ఇదే సమయంలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించడం, 49 శాతం కూడా పాస్‌కాకపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. దీంతో ఫెయిలైన విద్యార్థులందరినీ కనీస మార్కులతో పాస్ చేశారు. సరిగ్గా నాలుగు నెలలు కూడా బోధన సాగకుండానే ఈ నెల 8 నుంచి సంక్రాంతి సెలవులు రావడం.. దాన్ని పొడిగించడం జరిగింది. సిలబస్ సంగతేంటి? ►ఆన్లైన్ క్లాసుల్లో రోజుకు రెండు సబ్జెక్టులు బోధించడమే కష్టంగా ఉండేది. దీంతో జూలై–సెప్టెంబర్ వరకు జరిగిన ఆన్లైన్ క్లాసుల్లో పదో తరగతి సిలబస్ 60 శాతం పూర్తయినట్టు ఉపాధ్యాయులు చెబుతున్నారు. వచ్చే రెండు నెలల్లో మిగతాది పూర్తి చేసి, రివిజన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ప్రైవేటు స్కూళ్లలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి. ఇప్పుడు ఆన్లైన్ బోధన వల్ల సిలబస్ పూర్తి చేయడం సాధ్యమేనా అనే సందేహాలు కలుగుతున్నాయి. ►ఇంటర్ విద్యలో ప్రైవేటు కాలేజీల్లో ఇప్పటికే సిలబస్ పూర్తయింది. ఇప్పుడు ఆన్లైన్ చేపట్టినా రివిజన్ మాత్రమే ఉంటుందని కాలేజీ నిర్వాహకులు అంటున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో ఇంకా 50 శాతం సిలబస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కాలేజీ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. టీ–శాట్ ద్వారా బోధన గతానికన్నా భిన్నంగా ఉంటే తప్ప, పూర్తిస్థాయిలో సిలబస్ పూర్తయ్యే పరిస్థితి ఉండదు. ►ఉన్నత విద్య క్లాసులన్నీ ఆన్లైన్లోనే చేపట్టాలని రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు ఉత్తర్వులు ఇచ్చాయి. ఇంజనీరింగ్ ఫస్టియర్ మినహా మిగతా సెమిస్టర్ల సిలబస్ 70 శాతం వరకూ పూర్తయింది. ఫస్టియర్ విద్యార్థులకు చాలాచోట్ల ఇప్పుడిప్పుడే క్లాసులు మొదలవుతున్నాయి. కాబట్టి ఫస్టియర్ విద్యార్థులకు సమస్య ఉంది. డిగ్రీ కోర్సుల్లోనూ సిలబస్ పూర్తవ్వలేదని అధికారులు తెలిపారు. 30 వరకు సెలవులు పొడిగింపు రాష్ట్రంలో ఈ నెల 30 వరకూ అన్ని విద్యా సంస్థలకు సెలవులు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదివారం ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. తొలుత ప్రభుత్వం ఈ నెల 8 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో ఈ సెలవులను పొడిగించారు. వైద్య విద్య కాలేజీలు మినహా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ఈ ఉత్తర్వులు అమలవుతాయని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇదిలాఉంటే, ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూహెచ్తోపాటు మరికొన్ని యూనివర్సిటీలు సెలవుల కాలంలో ఆన్లైన్ పద్ధతిలో బోధన చేపట్టాలని ఆదేశాలిచ్చాయి. పాఠశాల విద్యా విభాగం అధికారులు సోమవారం సమావేశమై ఆన్లైన్ బోధనపై ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
‘ఆ మూడు శాంపిల్స్ నెగిటివ్ వచ్చాయి’
సాక్షి, విజయవాడ : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఈనెల 31 వరకు ఎలాంటి తరగతులు నిర్వహించరాదని ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ రామకృష్ణ వెల్లడించారు. ఏపీ ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఇంటర్మీడియట్ బోర్డు సూచనలను ఉల్లంఘిస్తే కళాశాల మేనేజ్మెంట్, ప్రిన్సిపాల్స్పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా వ్యాధి నేపథ్యంలో ఈ నెల 21 నుంచి జరగాల్సిన ఇంటర్మీడియట్ వాల్యూషన్ తేదీల్లో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. వాటిని ఈ నెల 31 తర్వాత ఇంటర్ బోర్డు వెల్లడించనున్నట్లు తెలిపారు. అదే విధంగా ఏలూరులో కరోనా హెచ్చరికలను ఖాతరు చేస్తూ పాఠశాల నిర్వహించిన నారాయణ, భారతి విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. యజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులు పాఠశాలలను సీజ్ చేశారు. (కనికా నిర్లక్ష్యంతో పార్లమెంటులో కలకలం) విజయవాడ: జిల్లాలో కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకొన్నామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. పదిహేను రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామన్నారు. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు 900 మంది విదేశాల నుంచి వచ్చారని, వాళ్లందరినీ హౌస్ ఐసోలేషన్‌లో ఉంచామని తెలిపారు. ఇప్పటి వరకు తీసిన మూడు శాంపిల్స్ నెగిటివ్ వచ్చాయని, ఈ రోజు(శుక్రవారం) మరో శాంపిల్ టెస్టింగ్ కోసం పంపామని అన్నారు. యాభై ఆసుపత్రిలో 200 పడకలు ఏర్పాటు చేశామని, థర్మల్ స్క్రీనింగ్ చేశాకే ఎయిర్ పోర్టు నుంచి అనుమతిస్తున్నామని తెలిపారు. నిన్న(గురువారం) ఫిలిప్పీన్స్ నుంచి వచ్చిన 18 మంది మెడికల్ విద్యార్థులను హౌస్ ఐసోలేషన్ లొ పెట్టామని, రాష్ట్రంలో కరోనా ప్రభావం భయపడే స్థాయిలో లేకపోయినా.. జాగ్రత్తగా ఉండాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. జనంలో కరోనాపై అపోహలు పోగొట్టి అవగాహన పెంచాలని సీఎం సూచించారన్నారు.(కామసూత్ర నటికి కరోనా పాజిటివ్) -
జూన్ 1 నుంచి ఇంటర్మీడియట్ తరగతులు షురూ..
- 2 వ తేదీన కాలేజీల్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు - సెప్టెంబర్ 30 నుంచి అక్టోబరు 12 వరకు దసరా సెలవులు - కాలేజీలకు అకడమిక్ క్యాలెండర్ జారీ హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ తరగతులు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి దశ ప్రవేశాలను ఈ నెల 25 నుంచి చేపట్టిన ఇంటర్మీడియట్ బోర్డు జూన్ 1వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. ఈ నెల 30న మొదటి దశ ప్రవేశాలను ఖరారు చేయనుంది. ఈ మేరకు రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ను నిర్వహించే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలకు అకడమిక్ కేలండర్‌ను జారీ చేసింది. 2016-17 విద్యా సంవత్సరంలో చేపట్టాల్సిన కార్యక్రమాల సమగ్ర వివరాలను అందులో వెల్లడించింది. ఇక జూన్ 2వ తేదీన కాలేజీల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జూనియర్ కాలేజీల్లో దాదాపుగా 223 పని దినాలు బోధన చేపట్టాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా కాలేజీలు చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. నెలవారీగా నిర్వహించాల్సిన పని దినాలను వెల్లడించింది. విద్యా సంవత్సరంలో మొత్తంగా 301 రోజులు ఉంటే అందులో 78 రోజులు సెలవు దినాలు పోగా 223 పని దినాలు కాలేజీలు పని చేయాలని పేర్కొంది. వచ్చే జూన్‌లో 25 రోజులు పని చేయాలని పేర్కొంది. అలాగే జూలైలో 23 రోజులు, ఆగస్టులో 24, సెప్టెంబరులో 22, అక్టోబరులో 15, నవంబరులో 24, డిసెంబరులో 23 రోజులు, 2017 జనవరిలో 23, ఫిబ్రవరిలో 22, మార్చిలో 22 రోజులు పని చేయాలని వెల్లడించింది. ఈ విద్యా సంవత్సరంలో ప్రధాన అంశాలు.. 1-6-2016 నుంచి 29-9-2016 వరకు: మొదటి విడత తరగతులు 23-9-2016 నుంచి 29-9-2016 వరకు: అర్ధ వార్షిక పరీక్షలు 30-9-2016 నుంచి 12-10-2016 వరకు: దసరా సెలవులు 13-10-2016 నుంచి: సెలవుల అనంతరం తరగతులు ప్రారంభం 13-10-2016 నుంచి 28-3-2017 వరకు: రెండో దశ తరగతులు 14-1-2017, 15-1-2017: సంక్రాంతి సెలవులు 16-1-2017 నుంచి: తిరిగి తరగతులు ప్రారంభం 23-1-2017 నుంచి 30-1-2017 వరకు: ప్రీఫైనల్ పరీక్షలు-1, హాజరు తక్కువగా ఉన్న వారికి తరగతులు. ఫిబ్రవరి 2 వారంలో: ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్-2, హాజరు తక్కువగా ఉన్న వారికి తరగతులు. ఫిబ్రవరి మొదటి వారంలో: ప్రాక్టికల్ పరీక్షలు షురూ.. నెలాఖరు వరకు హాజరు తక్కువగా ఉన్న వారికి తరగతులు. మార్చి మొదటి వారంలో: ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం 28-3-2017: కాలేజీలకు చివరి పని దినం. 29-3-2017 నుంచి 31-5-2017 వరకు: వేసవి సెలవులు. మే చివరి వారంలో: అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు. 1-6-2017 : మళ్లీ కొత్త విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభం.