- 2 వ తేదీన కాలేజీల్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
- సెప్టెంబర్ 30 నుంచి అక్టోబరు 12 వరకు దసరా సెలవులు
- కాలేజీలకు అకడమిక్ క్యాలెండర్ జారీ
హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ తరగతులు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి దశ ప్రవేశాలను ఈ నెల 25 నుంచి చేపట్టిన ఇంటర్మీడియట్ బోర్డు జూన్ 1వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. ఈ నెల 30న మొదటి దశ ప్రవేశాలను ఖరారు చేయనుంది. ఈ మేరకు రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ను నిర్వహించే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలకు అకడమిక్ కేలండర్‌ను జారీ చేసింది. 2016-17 విద్యా సంవత్సరంలో చేపట్టాల్సిన కార్యక్రమాల సమగ్ర వివరాలను అందులో వెల్లడించింది. ఇక జూన్ 2వ తేదీన కాలేజీల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
జూనియర్ కాలేజీల్లో దాదాపుగా 223 పని దినాలు బోధన చేపట్టాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా కాలేజీలు చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. నెలవారీగా నిర్వహించాల్సిన పని దినాలను వెల్లడించింది. విద్యా సంవత్సరంలో మొత్తంగా 301 రోజులు ఉంటే అందులో 78 రోజులు సెలవు దినాలు పోగా 223 పని దినాలు కాలేజీలు పని చేయాలని పేర్కొంది. వచ్చే జూన్‌లో 25 రోజులు పని చేయాలని పేర్కొంది. అలాగే జూలైలో 23 రోజులు, ఆగస్టులో 24, సెప్టెంబరులో 22, అక్టోబరులో 15, నవంబరులో 24, డిసెంబరులో 23 రోజులు, 2017 జనవరిలో 23, ఫిబ్రవరిలో 22, మార్చిలో 22 రోజులు పని చేయాలని వెల్లడించింది.
ఈ విద్యా సంవత్సరంలో ప్రధాన అంశాలు..
1-6-2016 నుంచి 29-9-2016 వరకు: మొదటి విడత తరగతులు
23-9-2016 నుంచి 29-9-2016 వరకు: అర్ధ వార్షిక పరీక్షలు
30-9-2016 నుంచి 12-10-2016 వరకు: దసరా సెలవులు
13-10-2016 నుంచి: సెలవుల అనంతరం తరగతులు ప్రారంభం
13-10-2016 నుంచి 28-3-2017 వరకు: రెండో దశ తరగతులు
14-1-2017, 15-1-2017: సంక్రాంతి సెలవులు
16-1-2017 నుంచి: తిరిగి తరగతులు ప్రారంభం
23-1-2017 నుంచి 30-1-2017 వరకు: ప్రీఫైనల్ పరీక్షలు-1, హాజరు తక్కువగా ఉన్న వారికి తరగతులు.
ఫిబ్రవరి 2 వారంలో: ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్-2, హాజరు తక్కువగా ఉన్న వారికి తరగతులు.
ఫిబ్రవరి మొదటి వారంలో: ప్రాక్టికల్ పరీక్షలు షురూ..
నెలాఖరు వరకు హాజరు తక్కువగా ఉన్న వారికి తరగతులు.
మార్చి మొదటి వారంలో: ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం
28-3-2017: కాలేజీలకు చివరి పని దినం.
29-3-2017 నుంచి 31-5-2017 వరకు: వేసవి సెలవులు.
మే చివరి వారంలో: అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు.
1-6-2017 : మళ్లీ కొత్త విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభం.
జూన్ 1 నుంచి ఇంటర్మీడియట్ తరగతులు షురూ..
Published Sun, May 29 2016 8:17 PM | Last Updated on Mon, Sep 4 2017 1:12 AM
Advertisement
Advertisement